పైకి దైవమాతగా ప్రచారం పోందుతూ భక్తుల విశ్వాసాలతో నాటకాలు అడుతూ.. కోట్లాది రూపాయలను పోగేసుకుని.. ఆనక వివాదాల్లో చిక్కుని వివాదాస్పద దైవమాతగా మారన రాధేమా మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ పత్రికల ప్రధాన శీర్షకగా మారింది. పైకి దైవాంశ సంహుతురాలిగా పోజులు కోట్టిన రాధేమా అ మధ్య సన్నిలియోన్ లా ఫోజులచ్చి తనలోని మోడ్రన్ బామ అందాలను చూసుకుంటూ మురిసిపోయింది. తాజాగా ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు కార్యకలాపాలు మరోకటి వెలుగులోకి రావడమే ఇందుకు కారణమైంది
రాధేమాను ఓ పక్క తన అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తే... మరో పక్క ఆమె వివాదాస్పద ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాహ్య ప్రపంచానికి తెలియని గుర్తించని విధంగా అమె ఫోజులతో వ్యాంపు క్యారెక్టర్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో వున్నాయి. ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటోను పరిశీలిస్తే.. ఓ కిట్టీ పార్టీలో రాధే మా పొట్టి స్కర్ట్‌లో కనిపించారు. వార్త ఏజెన్సీ పీటీఐ జర్నలిస్ట్ ఈ ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఫొటోలో రాధేమాతో పాటు ఉన్న మహిళలంతా ఎర్రని వస్త్రధారణతో నుదుటిపై తిలకం, చేతులకు గాజులు కలిగి ఉండటంతో పాటు కొందరు త్రిశూలాన్ని కూడ ధరించి కనిపించారు.
ఎప్పుడూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించే ఆమె ఇలా దర్శనమివ్వడం ప్రధాన వార్తగా నిలిచింది. భక్తులకు ప్రవచనాలు చెప్పే రాధేమా.. పోట్టి స్కర్టు ధరించడం.. అమె చుట్టూ వున్న మరో ఎనమిది మంది మాత్రం నిండు వస్త్రాధరణతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. రాధేమా విచిత్ర పోకడలు, మోడ్రన్ డ్రెసింగ్ లపై ప్రవచనాలు చేస్తే బాగుంటుందని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఇక నెట్ జనులు తమకు తోచిన విధంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల రాధే మాపై పలు వివాదాలు రావడం, కేసులు నమోదు కావడం తెలిసిందే. వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు ఆమెను విచారించారు. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అశ్లీలతను ప్రదర్శిస్తున్న దృశ్యాలతో కూడిన ఓ వీడయో సీడిని కూడ పోలీసులకు సమర్పించాడు. తాజాగా ఆమె ఓ ఫొటోలో మిని స్కర్ట్ తో దర్శనమివ్వడం మరోసారి చర్చనీయాంశమైంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more