గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం, అందులోనూ సిబ్బంది నిర్లక్ష్యంతో పది రోజుల శిశువు మృతి చెందడంపై పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా వైద్యాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పసికందును ఎలుకలు కొరకడంతో మరణించిన ఘటన దేశ విదేశాలలో కూడా సంచలనం కలిగించింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఈ విషయం గురించిన కథనాన్ని ప్రచురించాయి. జాతీయ మీడియా కూడా దీనిపై దుమ్మెత్తిపోసింది. దీంతో అధికారులలో ఎట్టకేలకు చలనం వచ్చింది.
గతంలో జిల్లా వైద్యాధికారులు ఈ ఆసుపత్రులలో అడపా తడపా తనఖీలు చేస్తున్నా.. ఎలుకలను చూసి చూడనట్టు వదిలేశారంటే.. వారి బాధ్యతారాహిత్యానికి ఈ ఘటన ధర్పణం పడుతోంది. గుంటూరు ఒక్కటే కాదు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో గత మూడు దశాబ్దాలుగా లిఫ్ట్ పనిచేయడం లేదని ఇటీవల మంత్రి గంట ఆస్పత్రి తనిఖీలో వెలుగుచూపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు ప్రభుత్వం పరువుతో పాటు ఇటు తమ సిబ్బందిని కాపాడుకునే పనిలో గుంటూరు వైద్యాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ.. ప్రభుత్వానికి శిశువు మృతికి కారణాల ఎలుకలు కరవడమే కాదని అతనికున్న జబ్బని కూడా ప్రాధమిక నివేదిక ఇచ్చశారు.
ఈ ఘటనపై పెను దుమారం రేగడంతో తాము ఏం చెప్పినా ప్రజలు నమ్మెస్థితిలో లేరని తేలడంతో.. జిల్లా వైద్యాధికారులు ఎట్టకేలకు ఎలుకలను పట్టే చర్యలకు ఉపక్రమించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటు చేసింది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 వరకు ఎలుకలు పట్టుబడ్డాయి. వాళ్లు పట్టుకున్న ఎలుకలను చూసి.. అసలు ఇది గుంటూరు ప్రభుత్వాసుపత్రేనా.. లేక ఎలుకల ఆసుపత్రా.? అన్న అనుమానంతో స్థానికులు విస్తుపోయారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more