pawan kalyan offers thanks to cm and ministers for withdrawing from land aquisition

Pawan thanks ap government for withdrawing land aquisition

pawan kalyan thanks cm chandrababu, AP government withdraws land acquisiton in capital area, pawan thanks AP government, pawan thanks AP government for withdrawing land aquisition, ap capital city, amaravathi, land acquisition, pawan kalyan, janasena, power star pawan kalyan

janasena president and popular tollywood actor power star pawan kalyan offers thanks to cm chandrababu and ministers for withdrawing from land aquisition in capital area.

చంద్రబాబుకు, రాష్ట్రమంత్రివర్గానికి పవన్ కల్యాన్ కృతజ్ఞతలు

Posted: 08/28/2015 08:34 PM IST
Pawan thanks ap government for withdrawing land aquisition

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయాడాన్ని ఉపసంహరించుకుంటూ.. భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జనసేన అధినేత, సీని హీరో పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రివర్గానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాయ సాయంత్రం సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందించారు.

రాజధాని ప్రాంత రైతుల మనోభావాలను సానుభూతితో అర్థంచేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాన్ ప్రచారంతోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మంత్రులు మర్చిపోరాదని, ఆయనపై మంత్రులు ఎవ్వరూ వ్యాఖ్యాలు చేయవద్దని ఇటీవల సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. కాగా, రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ తో మాట్లాడతానని నిన్న విజయవాడలో చెప్పిన చంద్రబాబు.. అంతకు మునుపే భూ సేకరణ చట్టం మేరకు రైతుల భూములను బలవంతంగా వెనక్కు తీసుకోవాలన్ని నిర్ణయంపై వెనక్కు తగ్గారు. దీంతో చంద్రబాబు సహా మంత్రి మండలికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap capital city  amaravathi  land acquisition  pawan kalyan  janasena  

Other Articles