Speaker Kodela SivaPrasad Given Shocking Statements On YS Jagan Mohan Reddy | Ap Special Status

Speaker kodela sivaprasad shocking statements ys jagan mohan reddy

speaker kodela siva prasad, ys jagan mohan reddy, ap special status, chandrababu naidu, andhra pradesh state, ap capital city, amaravathi master plan, university ragging incidents, ap water problems, ap special package

Speaker Kodela SivaPrasad Shocking Statements YS Jagan Mohan Reddy : During The Ap Assembly Sessions Speaker Kodela SivaPrasad Given Shocking Statements On YS Jagan Mohan Reddy.

జగన్ కు చురకలంటించిన స్పీకర్

Posted: 08/31/2015 10:36 AM IST
Speaker kodela sivaprasad shocking statements ys jagan mohan reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి కాస్త పరాభావమే ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్నే ప్రధాన అజెండాగా తీసుకుని, అధికార టీడీపీ పార్టీని నిలదీయాలని భావించిన ఆయనకు స్పీకర్ కోడెల వరప్రసాద్ రూపంలో అడ్డు ఎదురైంది. ప్రత్యేక హోదా చర్చ కోసం వైపీసీ ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో.. ఆ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు జగన్ మైక్ కోసం పదేపదే పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై స్పీకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘‘జగన్ గారూ... మీరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేందుకు అవకాశమిస్తేనే మీ సభ్యులు కూర్చుంటామనేలా వ్యవహరిస్తున్నారు. సభలో మీరు కాకుండా ఎవరు మాట్లాడినా మీ సభ్యులు వినేలా లేరు’’ అంటూ కోడెల వ్యాఖ్యానించారు. అంటే.. తమ నాయకుల్ని అదుపులో పెట్టుకోవాల్సిందిగా స్పీకర్ చెప్పకనే చెప్పాశారన్నమాట. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ అదే అంశంపై వాయిదా తీర్మానం అవసరం లేదని ఆయన చెప్పారు. దీనిపై నేడే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సభా సమయాన్ని వృథా చేయవద్దంటూ ఆయన విపక్ష సభ్యులను కోరారు. ఈ విధంగా స్పీకర్ మాట్లాడటంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు.

ఇదిలావుండగా.. ఐదురోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 12 అంశాలను ప్రతిపాదించాలని అధికార టీడీపీ నిర్ణయించింది. కరువు, పట్టిసీమ, ఎర్రచందనం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ప్రత్యేకహోదా, విభజన చట్టంలో హామీలు, కేంద్ర విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ర్యాగింగ్, బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలపై చర్చకు సిద్ధమవుతోంది. అలాగే ప్రత్యేక హోదా కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా భావిస్తోంది. మరోవైపు స్పెషల్ స్టేటస్ తోపాటు ఇసుక, ఉల్లి ధరలు, నీరు- చెట్టు అవినీతి, ఓటుకు నోటు కేసు, పుష్కరాల్లో తొక్కిసలాట, విష జ్వరాలు ఇలా మొత్తం 20 అంశాలను చర్చకు సిద్ధం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela siva prasad  ys jagan mohan reddy  ap special status  chandrababu naidu  

Other Articles