ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సామెత.. అయితే మోదీ ముందు ఇంటే గెలిచారు.. ప్రస్తుతం రచ్చ గెలిచే పనిలో ఉన్నారు. అయితే అంతా సజావుగా ఉంది అనుకున్న టైంలో హార్దిక్ పాటిల్ అనే పేరుతో కొత్త సంకటం ఎదురైంది మోదీగారికి. గుజరాత్ ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలతో ప్రధాని పీఠం ఎక్కిన నరేంద్రమోదీకి కొత్తసవాల్ ఎదురైంది. మోదీ ‘గుజరాత్ నమూనాను’ సవాలు చేస్తున్నాడు. గుజరాత్ మోడల్ అంటే పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికం గా అభివృద్ధి సాధించి ఉద్యోగాలు సృష్టించి ప్రజలను ప్రగతి పథంలో నడిపించడంగా ఇంతకాలం అర్థం చేసుకున్న భారతీయులను ఇప్పుడు కొత్త ప్రశ్నలు వేధిస్తున్నాయి. బాబాసాహెబ్ కు విరుగుడుగా బాలాసాహెబ్‌ను ఆరాధించే నవ యువకుడి నాయకత్వంలో వేలాదిమంది పాటీదార్ (పటేళ్లు) ఉద్యమించడం ఒక్క మోదీకీ, బీజేపీకే కాదు, దేశం మొత్తానికీ ఆందోళన కలిగిస్తున్న అంశం.
బీఆర్ - అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగం విద్యాసంస్థలలో, ఉద్యోగాలలో దళితులకూ, ఆదివాసీలకూ ప్రసాదించిన రిజర్వేషన్లనూ, మండల్ కమిషన్ సిఫార్సులను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఆమోదించి ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లనూ వ్యతిరేకిస్తూ హార్దిక్ పటేల్ నాయకత్వంలో పెల్లుబికిన ఉద్యమం మోదీ సర్కార్ కు పెనుసవాళ్లు విసురుతోంది. అమెరికాలో భారత సంతతికి చెందినవారు నిర్వహించే వ్యాపారాలలో పటేళ్లదే సింహ భాగం. సంపన్న కులంగా పరిగణించే పాటీదార్లలో సైతం ఇంత అసంతృప్తి దావానలంలా ఉందని మోదీ సైతం ఊహించి ఉండరు. హార్దిక్ పటేల్ కు ఒక సిద్ధాంతం లేదు. సామాజిక స్పృహ లేదు. కండబలంతో తమ కులానికి చెందినవారిలో భద్రతాభావం కలిగించడం ద్వారా ఎదిగిన వ్యవస్థ. ‘రిజర్వేషన్లు ఉంటే అందరికీ ఉండాలి..లేదా ఎవ్వరికీ ఉండకూడదు’ అనే సూత్రాన్ని పట్టుకొని ఉద్యమం నిర్మిస్తున్న హార్దిక్ పటేల్‌కి ఈ దేశం గురించి కానీ సమాజం గురించి కానీ అవగాహన బొత్తిగా లేదు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఘటించేందుకు తాము వీధుల్లోకి వస్తామంటూ ఎస్సీ, ఎస్టీ నాయకులూ, ఓబీసీ నాయకులూ హెచ్చిస్తున్నారు. అదే జరిగితే ఇక కల్లోలమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more