A Husband Named Sridhar Reddy Make A Plan To Killed His Former Wife | Bombs Attack | Nellore Crime News

Sridhar reddy plan killed his former wife with bombs around her house

husband kill wife, husband try to kill wife, sridhar reddy bomb attack on wife, nellore district crime news, nellore crime stories, police investigation, Husband Bomb Plan Wife, Husband Wife Fight

Sridhar Reddy Plan Killed His Former Wife With Bombs Around Her House : A Husband Named Sridhar Reddy Make A Plan To Killed His Former Wife By Arrange 19 Bombs Around Her House.

మాజీ భార్యను చంపేందుకు భర్త ‘నాటు’ ప్లాన్

Posted: 08/31/2015 11:07 AM IST
Sridhar reddy plan killed his former wife with bombs around her house

భార్యాభర్తల మధ్య తగాధాలు ఏర్పడటం, వాటి కారణంగా విడాకులు తీసుకోవడం వంటి చోటు చేసుకున్న ఘటనలు దేశంలో కోకొల్లలు. ప్రేమగా పలకరిస్తే పరిష్కారమయ్యే సమస్యల్ని.. తమ ఈగోకి తలొగ్గి వాటిని మరింత పెంచుకుని, ఇంకా దూరంగా జరిగిపోతున్నారు. విడాకులే శ్రేయస్కరమని ఆ దిశగానే చాలా జంటలు పయనమవుతున్నాయి. అయితే.. మరికొన్ని జంటలు ఒకరిపై మరొకరు పగాప్రతీకారాలు పెంచుకుంటూ విషం కక్కుకుంటున్నాయి. ఒకరినొకరు నాశనం చేసుకోవడమో లేక ప్రాణాలు తీసుకోవడమో వంటివి చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగాయి కూడా. ఆ తరహాలోనే తన మాజీ భార్యను హతమార్చేందుకు ఓ భర్త ‘నాటు’ ప్లాన్ వేయగా.. అది విఫలమై బోల్తా పడింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి దాంపత్య జీవితం సంతోషంగానే కొనసాగింది. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ వారిరువురు విడాకులు తీసుకున్నారు. అలా విడిపోయిన వారిద్దరు తమతమ వ్యక్తిగత జీవితాల్లో మళ్లీ బిజీ అయిపోయారు. కానీ.. శ్రీధర్ రెడ్డి మాత్రం తన మాజీ భార్య మీద పగ పెంచుకుంటూ వచ్చాడు. ఆమెను ఎలాగైనా హతమార్చాలని ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను చంపేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నాడు కూడా. తన మాజీ భార్య వుంటున్న ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి.. 19 నాటుబాంబులు అమర్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు.. రంగంలోకి దిగి శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, అతని దగ్గరున్న బాంబులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridhar Reddy  Husband Bomb Plan Wife  Police Investigation  

Other Articles