దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ఎట్టకేలకు అసలు మిస్టరీ వీడింది. ఆమెను తాను ఎందుకు చంపిందో పోలీసుల విచారణలో భాగంగా ఇంద్రాణి ముఖర్జియా వెల్లడించింది. తన గత జీవితానికి సంబంధించిన రహస్యాలను బయటపెడతానని షీనా నిత్యం తనని బెదిరించేదని, కాలక్రమంలో ఆమె బెదిరింపులు మరింత పెరిగిపోవడంతో ఆమెపై తాను అసహ్యాన్ని పెంచుకున్నట్లు ఇంద్రాణి చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. షీనాను చంపాలన్న ఉద్దేశం తనకి లేదని, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయిందని ఇంద్రాణి చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
ఈ విచారణలో భాగంగా ఇంద్రాణి మరిన్ని వివరాలు వివరిస్తూ.. షీనా, తాను ఇద్దరూ ఓ ఆర్థిక వివాదంలో కూరుకుపోయామని తెలిపింది. అలాగే.. తమ మధ్య తరచూ గొడవలు వస్తుండేవని, ఎక్కువసార్లు పోట్లాటవరకు కూడా వెళ్లాయని చెప్పింది. ఒక సందర్భంలో తాను భారీ మొత్తంలో నగదును ఆమె ఖాతాలో వేసి, ఆపై తిరిగి ఇవ్వాలని కోరితే.. షీనా అందుకు తిరస్కరించిందని విచారణలో వెల్లడించింది. పీటర్ తో వివాహానికి ముందు తన జీవితంలోని రహస్యాలను బయటపెడతానని నిత్యం బెదిరించేదని వివరించింది. తాను రాహుల్, షీనాలను విడదీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని, అన్నీ విఫలమైన తరువాతే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపినట్టు సమాచారం. అయితే.. షీనా హత్యవెనుక మరేదో బలమైన కారణం వుండవచ్చునని తాము భావిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇంద్రాణి కావాలనే కథ అల్లుతోందని, అంతకుమించి ఇంకో రీజన్ అయి వుంటుందని వారు అనుమానిస్తున్నారు. అందుకే.. సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు విచారణ మరింత తీవ్రం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా.. కస్టడీలో వున్న ఇంద్రాణి నుంచి నిజం చెప్పించేందుకు పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారట. ఆమె చెంపలు వాయించారని, లాఠీలతో కొట్టారని ఇంద్రాణి తరపు న్యాయవాది ఆరోపించారు. తన క్లయింటు పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. నేరాన్ని అంగీకరించాలని ఇంద్రాణిని బలవంతం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు.. సోమవారంతో ఇంద్రాణి కస్టడీ ముగియడంతో.. ఆమెతోపాటు సంజీవ్ ఖన్నా కుమార్తె విధిలను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి వున్నందున, ఇంకొన్ని రోజుల పాటు ఆమెను ప్రశ్నించేందుకు అనుమతించాలని ముంబై పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more