ఏపి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు నాయుడు, జగన్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా మీద, రాజమండ్రి పుష్కరాల్లో చనిపోయిన వారి మీద జగన్ చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వం తరఫున దమ్మిడి ప్రయోజనం లేదని జగన్ ఎద్దేవా చేశారు. జగన్ రాజమండ్రి ఘటన మీద స్పందిస్తు ప్రభుత్వం చేసిన హత్యలుగా వ్యాఖ్యానించడం అసెంబ్లీలో దుమారం రేపింది. టిడిపి నాయకుల, బిజెపి నేతల పొంతన లేని స్టేట్ మెంట్ ల కారణంగా చాలా మంది ప్రత్యేక హోదా రాదని భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీజే అబ్దుల్ కలాంకు సంతాపంతో పాటుగా , పుష్కారాల్లో చనిపోయిన వారికి కూడా సంతాప తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా వైసీసీ దాన్ని ఖండించింది. అబ్దుల్ కలాంకు నివాళి అర్పించిన అసెంబ్లీ. పుష్కరాల మృతులకు సంతాప తీర్మానం మీద తీవ్ర దుమారం రేగింది.
ప్రభుత్వం చేసిన హత్యలుగా వైసీపీ అసెంబ్లీలో అభివర్ణించింది. ప్రభుత్వం నిర్లక్షం కారణంగానే అంత మంది అమాయకులు చనిపోయినట్లు వైసీపీ నాయకులు చంద్రబాబు మీద, ఏపి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు గుప్పించారు. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మీద, వైసీపీ వైఖరి మీద అంతెత్తున లేచారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని విభజిస్తున్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్మోహ్న్ రెడ్డి ఏం చేశారని...ఎక్కడ దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశపు హాలు తలుపులు మూసేసి మరీ రాష్ర్ట విభజన చేస్తుంటే జగన్ పార్లమెంటులో కూర్చుని ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. హత్యలు చెయ్యడం వైసీపీ పార్టీ లక్షణమని. ప్రజలను అన్ని రకాలుగా రక్షించడం మా పార్టీ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more