Chandrababu naidu | Comedy | Assembly

Ap cm chandrababu naidu comedy in assembly

Chandrababu naidu, AP, jagan, Chandrababu Naidu Comedy, Assembly, AP Assembly

AP CM Chandrababu naidu comedy in assembly. Chandrababu Naidu spoke comedy punch on Jagan in the assembly sessions.

ITEMVIDEOS: చంద్రబాబు కామెడీ కేక.. అసెంబ్లీలో నవ్వులు

Posted: 09/01/2015 12:57 PM IST
Ap cm chandrababu naidu comedy in assembly

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు  ఎంత సీరియస్ గా ఉంటారో అందిరికి తెలుసు. ఏ టాపిక్ మీద అయినా ఆయన మాట్లాడేతీరు అందరికి తెలుసు. ఆయన మాట్లాడుతుంటే ఎంతో సీరియస్ గా మాట్లాడుతుంటారు. టాపిక్ ఏదైనా సీరియస్ గా మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవ్వరైనా. అయితే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడులో కామెడీ యాంగిల్ కూడా బయటకు వస్తుంటుంది. వేదికల మీద నర్సిరెడ్డి లాంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ప్రతిపక్షాల మీద వేసే కామెడీ పంచ్ లకు చంద్రబాబు మొహంలో నవ్వులు పూస్తుంటాయి. అయితే సొంతంగా కామెడీ చెయ్యడం చంద్రబాబు గారు చాలా అరుదు. అయితే నిన్నటి నుండి ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు కామెడీ చేశారు. దాంతో హౌజ్ లో నవ్వులు పూయించారు.

జగన్ కు, చంద్రబాబు నాయుడుకు మధ్య ఏపి అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్దం నడుస్తోంది. ప్రత్యేక హోదా మీద అమీ తుమీ తేల్చుకోవడానికి జగన్ తొడగొడితే నేను మాత్రం తక్కువా అన్నట్లు చంద్రబాబు నాయుడు కూడా మీసం మెలేస్తున్నారు. అయితే అసెంబ్లీలో హాట్ హాట్ గా సాగుతున్న సమావేశాల్లో ఎంటర్ టెన్ మెంట్, పంచ్ లు తగ్గాయి అనుకుంటుంటే చంద్రబాబు దాన్ని ఫిల్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద తన మాటల తూటాలతో దాడి చెయ్యడమే కాకుండా జగన్ మీద కామెడీ పంచ్ లు వేశారు. సిఎం అవుతారు అని ఎవరో జ్యోతిష్యులు చెప్పిన మాటలను నమ్మడం ఏంటి అధ్యక్షా.. కామెడీ కాకపోతే అంటూ జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు దాంతో సభలో అందరు నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు పేల్చిన పంచ్ బాగానే పేలింది. మొత్తానికి కారాలు మిరియాలు నూరుతున్న అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య నవ్వుల పువ్వులు పూయించారు చంద్రబాబు నాయుడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  AP  jagan  Chandrababu Naidu Comedy  Assembly  AP Assembly  

Other Articles