సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకలంటే ఎక్కువగా ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతున్న సంచలన షీనాబోరా హత్యకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణీ ముఖర్జియా.. పోలీసుల విచారణలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. షీనాబోరా బతికే వుండదని, తన బిడ్డను చంపలేదని ఆమె తెలిపినట్లు సమాచారం. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ వార్త సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పోలీసుల విచారణలో భాగంగా తాజాగా ఇంద్రాణీ ముఖర్జియా వెల్లడించిన విషయాలేమిటంటే.. షీనాబోరా అమెరికాలో నివసిస్తోందని, అయితే తనపై ద్వేషంతో ఇక్కడికి రావడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24, 2012లో షీనా బోరా హత్య చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇంద్రాణితోపాటు ఆమె రెండవ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం వారిని విచారించగా.. తాను హత్య చేసినట్లు ఇంద్రాణి ఒప్పుకుంది కూడా! ఈ హత్యకేసులో ప్రమేయం వుందని సంజీవ్ ఖన్నాతోపాటు కారు డ్రైవర్ కూడా అంగీకరించారు. అయితే.. ఈ కేసు వెనుక మరేదో హిస్టరీ దాగివుందన్న అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా.. ఇంతలోనే ఇంద్రాణి తన కూతురు బ్రతికేవుందని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే ఆమె చెబుతున్న ఈ వాదనను పోలీసులు ఏ మాత్రం నమ్మడం లేదు. కేసును పక్కదోవ పట్టించేందుకే ఆమె ఈ విధంగా సరికొత్త కథని అల్లుతోందని వారు భావిస్తున్నారు.
అయితే.. ఆమె వాదన నిజమా? కాదా? తెలుసుకోవడానికి యుఎస్ ప్రయాణించిన సమయంలో షీనా బోరా పేరు ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ షీనా బ్రతికేవుంటే.. ఆమె సెల్ ఫోన్‌ను ఇంద్రాణి ఏడాదిపాటు ఎందుకు వాడుకుందని, అలా వాడుకున్నట్లు ఆధారాలు కూడా వున్నాయని, ఆ సెల్ నుంచి రాహుల్ ముఖర్జియాకు మెసేజ్‌లు కూడా వెళ్లినట్లు సాక్ష్యాలు వున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుతో పోలీసులు జుట్టు పీక్కుంటుంటే.. తాజాగా ఇంద్రాణీ ఇలా వ్యాఖ్యానించడం వారిని మరింత ఇరుకున పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కేసులో మరెన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తాయో!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more