chandrababu Naidu | Jagan | outdatedabu Naidu

Chandrababu naidu comments on jagan for his outdated chandrababu statements

chandrababu Naidu, Jagan, outdated, ap, assembly, chandrababu counter to jagan, jagan statements, jagan on chandrababu Naidu

Chandrababu naidu comments on Jagan for his outdated chandrababu statements. Chandrababu naidu gave clariffication on chandrababu outdated statements.

ITEMVIDEOS: జగన్ ఫ్రెష్.. చంద్రబాబు ఔట్ డేటెడ్..?

Posted: 09/01/2015 01:29 PM IST
Chandrababu naidu comments on jagan for his outdated chandrababu statements

జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపిలో వెలుగు వెలుగుతున్న రాజకీయ నాయకులు. మంచి నాయకులు అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే అసలే రాజకీయాల్లో ఉంటున్నారు.. ఒకరి మీద మరొకరు విమర్శలు గుప్పించుకోకతప్పదు. ఎవరు ఎక్కువగా విమర్శలు చేస్తే వారిదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అయితే ఇలాంటి మాటల యుద్దానికి సరైన వేదిక అసెంబ్లీ. అందుకే నిన్నటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఒకరి మీద మరొకరు మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. నువ్వంటే నువ్వంటూ మాటలు కోటలు దాటుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మీద జగన్ చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు ఘాటుగా సమాధానమిచ్చారు. జగన్ మీద పంచ్ వేస్తూనే తన మీద జగన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు.

ఏపి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీస్తూ  జగన్, చంద్రబాబు ఔట్ డేటెడ్ అయ్యారని అన్నారు. దాని మీద చంద్రబాబు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. జగన్ మాటలు హద్దులు దాటనంత వరకు బాగానే ఉంటుందని, అవి దాటితేనే బాగుండదని చంద్రబాబు తన స్టైల్లో సమాధానం, హెచ్చరిక ఇచ్చారు. అమెరికా వెళ్లి చదువుకోమంటే జగన్ పారిపోయి వచ్చారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఏ మాత్రం చదువుకున్నారో నాకైతే తెలియదని... తనకే తెలుసునని అన్నారు. జగన్ ప్రెష్ అని, చంద్రబాబు నాయుడు ఔట్ డేటెడ్ అని అంటున్న జగన్ ఒక్క సారి ఆలోచించాలని అన్నారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఒడిసిపట్టుకొని ముందుకు సాగుతున్నానని, టెక్నాలజీని తెలుగు వారికి పరిచయం చేసిందే తానేనని వెల్లడించారు. మొత్తంగా రెండో రోజు సాగుతున్న సభ ఎంతో వాడీవేడీగా రసవత్తరంగా సాగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles