పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా, దగా, అన్ని మహా కవి శ్రీరంగం శ్రీనివాసులు అన్నట్లు.. నగరంలో రోజుకో వేషంతో, ఏదో ఒక రూపంలో దగా మోసాలు జరుగుతూనే వున్నాయి. చూడగానే ఆకట్టుకునే ఆహార్యంతో.. స్టైలిష్ దుస్తులు ధరించి.. ధనవంతుడిలా పోజు కొడుతూ.. అదే స్తాయిలో భారీగా మోసానికి తెరలేపి.. నమ్మిన వారిని కుచ్చుటోపి పెట్టాడు ఓ ఘనుడు. హైదరాబాద్ నగరంలలో ఆ కేటుగాడు చేసిన మోసం నుంచి తేరుకున్న షోరూం సిబ్బంది.. తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.
వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నంబరు 2 సాగర్ సొసైటీ చౌరస్తాలో ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ బైకుల షోరూంకు క్రితం రోజు సాయంత్రం రిచ్ లుక్ తో ఓ యువకుడు వచ్చాడు. తన పేరు సయ్యద్ తాహెర్ అని చెప్పాడు. తాను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో నివాసం ఉంటానని పరిచయం చేసుకున్నాడు. తానొక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని.. నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తుందని నమ్మబలికాడు. ఓ ఖరీదైన బైకు కొనడానికి వచ్చానని చెప్పాడు. చూడడానికి యువకుడు టిప్‌టాప్‌గా, ధనవంతుడి మాదిరిగా కనిపించడంతో షోరూం నిర్వాహకులు స్ట్రీట్-750 మోడల్ వాహనాన్ని చూపించారు. ఆ బైక్ ఖరీదు రూ.6 లక్షలని చెప్పారు.
తన వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయని కొంత అందులో నుంచి తీసుకొని మిగతాది ఫైనాన్స్ చేయాలని తాహెర్ కోరడంతో షోరూం నిర్వాహకులు అంగీకరించారు. అనంతరం అతడు.. ట్రయల్ రన్ వేసి చూస్తానని బైకును తీసుకొని బయటకు వచ్చి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లాడు. ఐదు నిమిషాలు గడిచాయి.. పది నిమిషాలు.. అరగంట.. గంట.. మూడుగంటలు.. ఇలా ఎంత సేపు గడిచినా అతడు తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని సిబ్బందికి అర్థమైంది. అతని జాడ కోసం వెతికినా కనిపించకపోవడంతో.. అతడు బైక్‌తోసహా పారిపోయినట్టు షోరూం మేనేజర్ షీలా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోరూంకు చేరుకొని అక్కడ సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా.. అతడు రెండు చోట్ల పెట్రోల్ పోయించుకుని కరీంనగర్ వైపుగా ఉడాయించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ దారిలో టోల్‌గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more