Kapu Corporation | AP | Chandrababu Naidu

That go brings new hopes for kapus lives

AP, Kapu, reservation, Chandrababu Naidu, Go on Kapu, Kapu Nadu, Kapu reservation committee

That GO brings new hopes for Kapus lives. Chandrababu Niadu govt brought new GO on kapu reservation in the state of AP.

కాపుల జీవితాలను మార్చనున్న జిఓ

Posted: 09/03/2015 11:52 AM IST
That go brings new hopes for kapus lives

కాపులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అదించింది.  కాపుల అభివృద్దికి ప్రత్యేకంగా కాపు కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకువచ్చింది ఏపి ప్రభుత్వం. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో  ప్రకటన చేశారు. కాపుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు తగిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. . ఏళ్ళుగా నానుతున్న ఈ డిమాండ్ కు తుది రూపం రావడంతో కాపు సామాజికవర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది. అగ్రవర్ణం పేరుతో ఇంతకాలం అందకుండా ఉన్న రిజర్వేషన్లు త్వరలోనే కాపులకు దక్కనున్నాయి.

ఈ ఉదయం మరువరానిది.. మరల రానిది

కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఏళ్ళ నుంచి విన్పిస్తున్నా హామీలకు తప్ప అమలుకు నోచుకోలేదు. కాపులను బీసీల్లో చేర్చితే వీరి దశ మారినట్లేనని చెప్పాలి. కానీ ఆ డిమాండ్ నేరుగా అమలు కాకపోయినా కానీ కాపునాడు ఏర్పాటు ద్వారా వారి అభివృద్దికి పాటుపడాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా కాపు కార్పోరేషన్ ను తీసుకువచ్చింది. ఏళ్ళ తరబడి ఉన్నత వర్గంగా వెనకబడ్డ కాపులకు ఇదో చేయూతగా నిలుస్తుంది. కాపుల అభివృద్దితో ముడిపడిన దీనిపై ఎన్నో ఉద్యమాలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాపులు దీక్షలు చేశారు. ఈ పోరాటానికి రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు మద్దతిచ్చారు. అయితే ఆచరణ విషయానికి వచ్చే సరికి మాత్రం అంతా పక్కనబెడుతూ వచ్చారు. కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు వారి అభివృద్ధిపై మాత్రం చిత్తశుద్ధిని చూపలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగానే ఈ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. కాని అమలు చేయటంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా అంశాన్ని పట్టించుకోకుండా నానుస్తూ వచ్చాయి. దీనికి తోడు విభజన ఉద్యమం, సమైక్య ఉద్యమం తీవ్రంగా నడవటంతో ఈ ప్రభావం కూడా దీనిపై పడింది.

ఎట్టకేలకు బాలారిష్టాలు దాటుకుని ఉద్యమాల స్థాయి నుంచి.. అసెంబ్లీలో ప్రకటన ముఖ్యమంత్రిచే చేయించుకునే వరకు కాపులు విజయం సాధించారు. కాపు కార్పోరేషన్ ఫలాలు వారికి అందితే వారి సామాజిక వర్గ సమగ్ర అభివృద్ధి త్వరలోనే సాద్యమని విశ్లేషకులు అంటున్నారు. అగ్ర వర్ణం పేరుతో పేదరికంలో మగ్గుతున్న ఎన్నో కుటుంబాల్లో బాబు నిర్ణయంతో వెలుగులు నిండుతాయని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా కాపుల అభివృద్దికై తీసుకువచ్చిన చారిత్రాత్మక జీఓ మీద కాపు జనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    విరిగిన స్వప్నాలు నన్ను
    తోస్తున్నవి  వాస్తవానికి
    ఎగిసెగిసిపడే ఆశలు
    చుపుతున్నాయ్ వెలుగుబాట.
మండుతున్నాయ్ గుండెలు
సహనానికి శాపంలా-
విచుకున్నాయ్ కళ్ళు
కాలానికి మార్పుగా!
    రేపు నిలిచి వున్నది
    మంచికి మరో పేరుగా....
   ''కాపు'' కాస్తాను నేను
    దూరంగా అగుపడే ఆ రేపుకోసం....

కానీ ఆ రేపు వచ్చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ రేపు.. కళ్లెదుట సాక్షాత్కారమైంది. ఎంతో కాలంగా కావాలి.. ఇవ్వాలి అన్న డిమాండ్ కు తుది రూపం వచ్చేసింది. బలం, బలగంగానే కాకుండా ఇక అన్నింటా కాపుల అభివృద్దికి నేటి నుండి నాంది పలకాలని కోరుకుంటున్నాం...

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Kapu  reservation  Chandrababu Naidu  Go on Kapu  Kapu Nadu  Kapu reservation committee  

Other Articles