భారతీయ కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా కొత్త కొత్త కథలను తెరమీదకు తీసుకొచ్చి.. పోలీసులను ముచ్చెమటలు పట్టించడంతోపాటు దేశాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇప్పటికే ఇంద్రాణి.. షీనాబోరా అసలు చావలేదని, ఆమె అమెరికాలో వుంటోందని, తనమీద అసహ్యంతోనే తాను తిరిగి ఇండియాకు రావడం లేదంటూ వ్యాఖ్యలు చేసి కేసును పక్కదారి పట్టించేందుకు కొత్త కథను అల్లింది. ఇప్పుడు మరో కట్టుకథతో ఆమె వార్తల్లోకి నిలిచింది.
తన కుమారుడిగా లోకానికి పరిచయమైన మిఖాయిల్ అసలు తన కొడుకే కాదని ఇంద్రాణి వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి. తాను అతనిని దత్తతు తీసుకున్నానని ఆమె చెప్పిందట. తనను కలిసిన న్యాయవాదికి ఇంద్రాణి ఈ విషయాన్ని వెల్లడించినట్లు ‘టుడే’ న్యూస్ చానల ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కాగా.. మిఖాయిల్ చాలా సందర్భాల్లో తాను ఇంద్రాణి కుమారుడినేనని వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఇంద్రాణి యుక్తవయస్సు (టీనేజ్)లో వున్నప్పుడు ఆమెతో సహజీవనం చేసిన సిద్ధార్థ దాస్... షీనా, మిఖాయిల్ ఇద్దరూ తనకు, ఇంద్రాణికి పుట్టిన బిడ్డలుగా వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెల్లడిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఓ నిర్ణయం తీసుకున్నారు. డీఎన్ఏ రిపోర్టు ద్వారా ఎవరు ఎవరికి పుట్టారన్న విషయం తేలిపోతుందని వారు వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. నిన్నటివరకు లగ్జరీ లైఫ్ ని అనుభవించిన ఇంద్రాణి.. ఇప్పుడు జైల్లో మగ్గుతోంది. ప్రస్తుతం ముంబై జైల్లో వున్న ఆమెను అధికారులు సాధారణ ఖైదీగానే పరిగణిస్తూ.. పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఇచ్చారు. గదిలో ఫ్యాన్ కూడా లేదు. పైగా.. ఒక్క కిటికీ మాత్రమే వుంది. ఇక భోజనంలో ఉదయం అల్పాహారంగా వడాపావ్, టీలు ఇస్తున్నారు. ఇంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నందుకే ఈమె కాస్త పిచ్చిదైందని, అందుకే రోజుకో కథ సృష్టిస్తోందని పుకార్లు సంచరిస్తున్నాయి. కాగా.. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా సమక్షంలో ఆమెతోపాటు ఇతర నిందితులను కూర్చోబెట్టిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more