Purandheshwari | Central Govt | Special status

Bjp leader purandheshwari clear that central govt will announce only package not special status to any state

Purandheshwari, Central Govt, Special status, Special package, AP, Telangana, Finance Commission

BJP Leader Purandheshwari clear that central govt will announce only package not special status to any state. Purandeshwari said that central govt about the special package and special status.

ITEMVIDEOS:ప్రత్యేక హోదా లేదు.. కేవలం ప్యాకేజీలే

Posted: 09/07/2015 09:27 AM IST
Bjp leader purandheshwari clear that central govt will announce only package not special status to any state

విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాలి అని డిమాండ్ నెరవేరేలా కనిపించడం లేదు. దాదాపుగా ప్రత్యేక హోదా కుదరదు.. ప్యాకేజీ అయితే ఓకే అన్నట్లు ఇప్పటి దాకా సంకేతాలు అందాయి. అయితే తాజాగా బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ప్రత్యేక హోదా మీద మరోసారి కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోందని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కుదరదు అని చెప్పడంతో పాటు ప్యాకేజీకే కేంద్రం మొగ్గుచూపుతోందని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా మీద తొందరలోనే స్పష్టమైన ప్రకటన వస్తుందని అనుకుంటున్నా కానీ ఇప్పటి వరకు కనీసం ఊసుకూడా లేదు. తాజాగా పురంధేశ్వరి మాట్లాడిన తీరు ఏపితో పాటు మరిన్ని రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం అస్సలు కుదిరేలా కనిపించడం లేదని స్పష్టమవుతోంది.

కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఇస్తుందని పురంధేశ్వరి వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల లాభం లేదని... తేల్చిన నేపధ్యంలో పురంధేశ్వరి మాటలు ఏపికి ప్రత్యేక హోదా కేటాయింపు జరగదు అని తేలిపోయింది. గత కొంత కాలంగా ప్రత్యేక ప్యాకేజీనా..? లేదంటే ప్రత్యేక హోదానా..? అన్న దాని మీద చర్చ సాగుతోంది. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీతో, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన తర్వాత కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో చేసినా తమకు కావాల్సింది చేస్తే చాలు అని అనడం దానికి నిదర్శనం. ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నందునే చంద్రబాబు అలా అనాల్సి వచ్చిందని గతంలో చర్చ కూడా సాగింది. తాజాగా పురంధేశ్వరి కేంద్రం ఖచ్చితంగా ప్యాకేజీని మాత్రమే ప్రకటిస్తుందని తేల్చి చెప్పేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Purandheshwari  Central Govt  Special status  Special package  AP  Telangana  Finance Commission  

Other Articles