China Lishui River Bridge Demolished Use Dynamite |China Bridge Collapsed | Zhangjiajie | Video

Incredible moment bridge is demolished in three seconds

China Bridge Demolished, Lishui Bridge Blown Up, Debris Fall Into River, bridge Collapse, china bridge, Lishui River Bridge, 800 feet long bridge, China Lishui River Bridge, China, Lishui River, Bridge Demolished, Zhangjiajie, Dynamite

A four decade old bridge, Lishui Bridge in Zhangjiajie, central China, was demolished using a tonne of explosives on September 8 to make way for a new bridge,

ITEMVIDEOS: కనురెప్ప మూసినంతలో కూలిన బ్రిడ్జు..

Posted: 09/10/2015 08:23 PM IST
Incredible moment bridge is demolished in three seconds

చైనాలో ఓ పట్టణంలో సుమారుగా నాలుగు దశాబ్దాల నుంచి వస్తు, వాహణలతో పాటు మనుషులను కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దాటిస్తూ.. సేవలంధించిన  పురాతన వంతెనను అక్కడి అధికారులు కూల్చివేశారు. అదికూడా కేవలం రెండు సెకన్లలో. కనురెప్ప మూసి తెరిచేంత సమయంలో అంతా జరిగిపోయింది. అయితే దుమ్ముధూలి మాత్రమే కనిపించాయి తప్ప.. అంతకు ముందు అక్కడున్న వంతెన మాత్రం తునాతునకలై నదిలో కలిసిపోయింది.



మధ్య చైనాలోని షాంగ్జియాజీ నగరంలో గల లిషుల్ బ్రిడ్జిని కూల్చేయడానికి సరిగ్గా ఒక టన్ను పేలుడు పదార్థాలను ఉపయోగించారు. అక్కడ కొత్త బ్రిడ్జి కట్టడం కోసం ఈ పాత బ్రిడ్జిని కూల్చేశారు. ఈ మొత్తం కూల్చివేత ప్రక్రియను వీడియో తీసి, రెండు సెకండ్లలోనే తాము ఎలా కూల్చేశామో టీవీ చానళ్లలో చూపించారు. ఒకే సమయంలో మొత్తం బ్రిడ్జి భాగాలన్నీ దుమ్ము, ధూళి రూపంలోకి మారిపోయాయి. కింద ఉన్న లిషుల్ నదిలోకి కలిసిపోయాయి.

ఈ బ్రిడ్జి పొడవు 800 అడుగులు. 44 ఏళ్ల క్రితం దీన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు. దాని చుట్టూ అనేక నివాస, వాణిజ్య భవనాలున్నాయి. దాంతో కూల్చివేత సమయంలో ఎవరూ అక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిడ్జికి ఉన్న 15 భాగాలకు విడివిడిగా పేలుడు పదార్థాలు, డిటనేటర్లు అమర్చారు.  దానికితోడు 2,888 డైనమైట్ స్టిక్లను ఉపయోగించారు. మొత్తం ప్లాన్ వేయడానికి, అమలుచేయడానికి మాత్రం నెల రోజులు పట్టింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Lishui River  Bridge Demolished  Zhangjiajie  Dynamite  

Other Articles