ISIS linked woman held at Hyderabad Airport

Isis woman terrorist held at hyderabad airport

ISIS, airport, shamshabad, nikki joseph, Moinnudin, luring people to join ISIS, facebook account, Moinnudin Isis terrorist, Joseph is likely to be questioned by police, 30 people flying to join ISIS have been detained in Shamshabad airport, Nikki Joseph supposed to fly to Dubai.

Police arrested a woman at Shamshabad International airport on the suspicion of her alleged link with the dreaded terrorist outfit ISIS.

ఐఎస్ఐఎస్ లోకి అకర్షిస్తున్న అమెరికన్ మహిళా ఉగ్రవాది.. హైదరాబాద్ లో అరెస్టు

Posted: 09/11/2015 08:14 PM IST
Isis woman terrorist held at hyderabad airport

శంషాబాద్ విమానాశ్రయంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన ఒక మహిళా ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ జోసెఫ్ అనే ఉగ్రవాదిని పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ దేశస్థురాలైన జోసెఫ్ గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని పోలీసులు భావిస్తున్నారు. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయన్నారు.

హైదరాబాద్కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొయినుద్దీన్తో కలిసి ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్తో పరిచయం అయ్యిందని... ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయిందని తెలిపారు. దుబాయ్ నుంచి అమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్ రప్పించారు. అమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 హైదరాబాద్లో ఎంతమందితో అమెకు పరిచయాలు ఉన్నాయి..?, ఎవరెవరికి ఆమె ఎర వేసింది..? అనే వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తూ ఇప్పటివరకు 30 మందికి పైగా వ్యక్తులు శంషాబాద్లో అరెస్టయ్యారు. కోల్కతా నుంచి కూడా కొంతమంది గతంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. తాజా అరెస్టుతో కొంతవరకు దీనికి అడ్డుకట్ట పడినా.. ఇంకా ఏయే మార్గాల ద్వారా వెళ్తున్నదీ తెలుసుకోవాల్సి ఉంది. దానికి ఈమె అందించే సమాచారం కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  airport  shamshabad airport  nikki joseph  Moinnudin  

Other Articles