ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని అమ్మాయిలను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న బీ టెక్ చదువుతున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్లు తెరిచి.. వారితో అనేక విషయాలు షేర్ చేసుకుని, తమ సీక్రెట్లన్నీ తెలుసునని మరో అకౌంట్ తో వారికి టచ్ లోకి వచ్చి తాను కోరినంత డబ్బులిస్తే.. వాటిని తొలగిస్తానని లేకపోతే ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి.. దాదాపు 200 అమ్మాయిలను మానసికంగా వేధించిన కేటుగాడిని తాము అదుపులోకి తీసుకున్నాము. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన ప్రకారం ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
18 నెలల నుంచి మజీద్ ఈ ఆగడాలు సాగిస్తున్నాడు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్లు ఓపెన్ చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న టీనేజ్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునేవాడు. అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారి వ్యక్తిగత సమాచారం రాబట్టేవాడు. వారి నగ్న ఫొటోలు పంపమనేవాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే ఈ ఫొటోలను పోర్న్సైట్లో పెడతానంటూ వారిని బెదిరించాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని అమ్మాయిల తల్లిదండ్రులను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మీ అమ్మాయి నగ్న చిత్రాలు తన దగ్గర ఉన్నాయని, వీటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించేవాడు.
ఇలా ఓ అమ్మాయి నుంచి 86 వేల రూపాయలు వసూలు చేశాడు. తనను వెంకటేశ్వరరెడ్డిగా పరిచయం చేసుకున్న మజీద్ ఓ అమ్మాయిని ఇదేవిధంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సైబరాబాద్ కమిషనర్ ను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగు చూసింది. సైబరాబాద్ పోలీసులు నిందితుడు మజీద్ను అరెస్ట్ చేశారు. మజీద్ చర్యల వల్ల ఎందరో అమ్మాయిలు మానసిక క్షోభ అనుభవించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోషల్ మీడియా వాడకం గురించి పిల్లలకు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more