suspected injection psycho found in bhemavaram

There is no matter of harm with injection psycho says venkata ramudu

andhrapradesh, injection, psycho, DGP jasti venkata ramudu, bheemavaram, narasapuram, DSP, pulsur bike, two psycho suspects in police handover, twin godavari districts

As Andhra pradesh police DGP, said there is no matter of harm with injection psycho, the bheemavaram people caught three suspected persons, of which one absconded

పోలీసుల అదుపులో అనుమానిత ఇంజక్షన్ సైకోలు.. హాని లేదంటున్న పోలీసులు

Posted: 09/11/2015 09:52 PM IST
There is no matter of harm with injection psycho says venkata ramudu

ఇంజక్షన్ సైకోను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ప్రజల్లో సైకో పట్ల వున్న భయాందోళనను పక్కనబెట్టి.. అదంగా కేవలం మీడియా విస్తృత కథనాలే అంటూ కొట్టిపారేసేందుకు సిద్దమయ్యారు. అసలు సైకో వల్ల ప్రజలకు ఎలాంటి హానీ లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు అన్నారు. గత కొన్ని రోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఇంజక్షన్ సైకో సంచరిస్తున్నాడన్న వార్తలతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నా.. వాడిని పట్టుకోనేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం.. సైకో మాత్రం ఒక్క రోజు ఒక్కో చోట ఇంజక్షన్ ఇస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఈ  నేపథ్యంలో తమ వైఫల్యాలను పక్కనబెట్టిన పోలీసులు సైకో వల్ల ప్రజలకు ఎలాంటి హానీ లేదని చెబుతున్నారు. మరి ఇంజక్షన్ ఇస్తున్నది ఎందుకన్న విషయాన్ని ప్రశ్నిస్తే మాత్రం నీళ్లు మింగుతున్నారు. అదీగాక ఇప్పటివరకూ ఎక్కడా ఇంజక్షన్ సైకో దాడులతో ఏ ఒక్కరూ గాయపడలేదని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

కాగా ఉభయ గోదావరి జిల్లాలో పోలీసులకు, ప్రజలకు కంటిమీద కునుకు కరవయ్యేలా చేస్తున్న సైకో పట్ల అప్రమత్తంగానే వున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ముగ్గురు వ్యక్తులు బ్లాక్ పల్సర్ పై సంచరిస్తుండగా గ్రామస్తులు వారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంజక్షన్ సైకో అనే అనుమానంతో వీరిని గ్రామస్తులు వెంబడించి, ఇద్దరిని పట్టుకోగా, ఒకరు పరారైనట్లు సమాచారం. గ్రామస్తులు వెంబడిస్తున్న సమయంలో వారు పల్సర్ బైకును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఇద్దరు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని ఓ అధికారి తెలిపారు. అయితే పాత కేసుల నేపథ్యంలోనే వారు పారిపోయినట్లు వారు సైకో కాదని మరో అధికారి అనుమానం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  injection  psycho  DGP jasti venkata ramudu  bheemavaram  

Other Articles