ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యమైన పనులన్నీ అక్కడనుంచే చక్కబెడుతున్నారు. వరుస సమీక్షలతో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అక్టోబర్ 22న జరిగే నవ్యాంధ్ర నూతన రాజధాని భూమి పూజ తెలుగు జాతి చరిత్రలోనే ఓ నూతన అధ్యయనం అవుతుందని చంద్రబాబు చెప్పారు. కేపిటల్ సిటీ కోసం 33వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారీ సమీకరించడం దేశంలోనే చారిత్రాత్మకమన్నారు. సింగపూర్ ప్రధానిగా తిరిగి ఎన్నికైన లీసిన్ లూంగ్‌కు సీఎం బాబు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న లూంగ్ వ్యాఖ్యలను స్వాగతించారు. అటు నవ్యాంధ్ర రాజధానిలో తొలి మెట్రో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. మెట్రో రైల్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. 6,769 కోట్లతో చేపట్టే విజయవాడ మెట్రో ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో రైల్ అధారిటీకి అప్పచెప్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 26 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం ఉంటుందని, 2018 డిసెంబర్ నాటికి తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
విభజన చట్టంలోని హామీ మేరకు విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టులు నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం జపాన్ సంస్థ జైకాతో మాట్లాడుతున్నామని చెప్పారు.విజయవాడ-గుంటూరు మధ్య హైస్పీడ్ రైళ్లు తీసుకొస్తామనీ, విజయవాడ, గుంటూరు నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1000 కోట్లు కేటాయించామన్నారు. అటు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12నుంచి ఒంటిగంట వరకు ప్రజలనుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు. మరోవైపు ఏపీ రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు విరాళమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులు చంద్రబాబును కలిశారు. ప్రభుత్వం తమకు చెల్లించిన వార్షిక అద్దెల మొత్తం రూ. 3,52,679 చెక్‌ను రాజధాని నిర్మాణానికి విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ ఆ మొత్తాన్ని సీఎంకి అందజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more