సానియా మీర్జా ఖాతాలో మరో గ్రాండ్ స్లామ్ వచ్చి చేరింది. తొలిసారి యుఎస్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ సాధించింది. దీంతో సానియా ఇప్పటివరకు ఐదు గ్రాండ్ స్లామ్స్ గెలిచినట్లైంది. భారత ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జైత్రయాత్ర కొనసాగుతోంది. యూఎస్ ఉమెన్స్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా... స్విట్జర్లాండ్ ప్లేయర్ మార్టినా హింగిస్ చెలరేగి ఆడటంతో... మ్యాచ్ వన్ సైడ్ సాగింది. 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. మ్యాచ్ ఏ దశలోనూ డెల్లాక్వా, ష్వెదోవా జోడీ పోటీ ఇవ్వలేకపోయింది.
సానియా ఇప్పటివరకు మూడు మిక్స్డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్ స్లామ్‌లు... ఉమెన్స్ డబుల్స్‌లో రెండు గ్రాండ్ స్లామ్స్లు గెలుచుకుంది.సానియా కెరీర్లో ఈ ఏడాది ది బెస్ట్‌గా కనిపిస్తోంది. ఈ సంవత్సరంలోనే ఆమె రెండు గ్రాండ్ స్లామ్‌లు దక్కించుకుంది. ఇటీవలే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. లియాండర్ పేస్ తర్వాత ఇలాంటి పురస్కారం అందుకున్న రెండో భారతీయ టెన్నిస్ ప్లేయర్ సానియానే. 2009లో మహేష్ భూపతితో కలిసి తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా... ఆమె గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. సానియా ఇప్పటివరకు 14 మెడల్స్ గెలుచుకుంది. వాటిలో ఆరు బంగారు పతకాలున్నాయి. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో-ఆసియా గేమ్స్‌లో పతకాలు గెలిచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more