పదేళ్ల క్రితం.. ఓ అబ్బాయి తనని ప్రేమించాల్సిందిగా ఓ అమ్మాయి వెంట పడ్డాడు. అందుకు అంగీకరించని ఆ అమ్మాయి.. తన వెంటపడొద్దని వేడుకుంది. తనని వదిలేయాలని ప్రాధేయపడింది. కానీ.. ఆ అబ్బాయి మాత్రం వినలేదు. ప్రేమ, పెళ్లి అంటూ ఆమెను మరింత వేధించసాగాడు. అది భరించలేకపోయిన ఆ అమ్మాయి.. తన కుటుంబసభ్యులకు మొత్తం వ్యవహారాన్ని వివరించింది. ఆగ్రహించిన కుటుంబీకులు ఆ అబ్బాయికి తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతనిలో ఏ మార్పు రాకపోగా.. ఓరోజు నేరుగా ఆ అమ్మాయి వుంటున్న ఇంటి గదిలో చొరబడ్డాడు. దాంతో నిర్ఘాంతపోయిన అమ్మాయి.. గదిలోంచి బయటికొచ్చేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అందులో భాగంగా ఆ అమ్మాయికి గాయాలయ్యాయి కూడా! తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఇక అప్పటినుంచి ఈ కేసు వ్యవహారం నడుస్తూనే వుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీనగర్‌కు చెందిన ఓ యువతి (అప్పుడు మైనర్)ని స్థానికంగా ఉండే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అడుగు బయటపెడితే చాలు.. నరకం చూపించేవాడు. కోచింగ్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు అతడి ప్రవర్తన మితిమీరేది. ప్రేమించానని, పెళ్ళి చేసుకోవాలని వేధించేవాడు. అతని వేధింపులను కొంతకాలం భరించిన యువతి చివరకు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆ యువకుడిని పిలిచి మందలించారు. ఇంత జరిగినా ఆ యువకుడిలో మార్పు రాకపోగా.. 2005 జనవరి 30న మరింత బరితెగించాడు. ఆ యువతి నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించాడు. అలికిడి విని నిద్రలేచిన యువతి తన గదిలో ఆ యువకుడిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. కంగారుగా లేచి బయటకు పరుగెత్తాలని ప్రయత్నించింది. దీంతో హఠాత్తుగా ఆమె చేయిపట్టుకున్న యువకుడు మళ్ళీ ‘ప్రేమ.. పెళ్ళి’ అంటూ వేధించాడు. ఈ పెనుగులాటలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంతలోనే ఇంట్లోవాళ్లు రావడంతో ఆమె బయటపడింది.
అతగాడి వేధింపులు తారాస్థాయికి చేరడంతో.. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించించి. దీంతో వారు కేసు నమోదు చేసి.. ఆ యువకుడిపై అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం తదితర నేరాల కింద కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో స్థానిక కోర్టు యువకుడికి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అయితే.. ఆ యువకుడు స్థానిక కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును విచారించిన హైకోర్టు.. దాన్ని సమర్థించి, శిక్షా కాలాన్ని మాత్రం రెండేళ్ళకు తగ్గించింది. దీంతో అతను సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అప్పటికే ఏడాది పాటు జైల్లో ఉన్న యువకుడి శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు.. గత నెల 8న బెయిల్ మంజూరు చేసింది. కానీ.. తాజాగా ఈ కేసులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ వి.గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ వేధింపుల కేసు పూర్వాపరాలు, స్థానిక కోర్టు, హైకోర్టు తీర్పుల్ని పరిశీలించిన ధర్మాసనం.. నేరం నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే.. శిక్షా కాలాన్ని ఏడాదికి తగ్గించాలని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అలా జరగాలంటే ఒకే మార్గం ఉందని సూచించింది. నిందితుడు ఆ యువతి వద్దకు వెళ్ళి, ఆమె కాళ్ళపై పడి క్షమాపణ కోరుకోవాలని, ఆమె క్షమిస్తేనే శిక్షను తగ్గిస్తామని స్పష్టం చేసింది. ఖైదా..? స్వేచ్ఛా? తేల్చుకోవడానికి ఆ యువకుడికి అక్టోబర్ 6 వరకు గడువిచ్చింది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more