Shoot at sight orders on Dogs. In China

Shoot at sight orders on dogs in china

Dogs, Shoot, Shoot at soght, china, Dog Festival, China orders

Shoot at sight orders on Dogs. In China, a dist govt order to shoot the dogs for the public safety. Shan dong provence dayang dist muncipality took violent order for dogs.

కుక్కలు కనిపిస్తే కాల్చివేత..!

Posted: 09/14/2015 11:15 AM IST
Shoot at sight orders on dogs in china

కనిపిస్తే కాల్చివేత.. అనే మాట కరడుగట్టిన హంతకులకో లేదంటే టెర్రరిస్టుల మీదో జారీ చేసే పోలీస్ ఆర్డర్. కానీ ఈ ఆర్డర్ తాజాగా కుక్కల మీద జారీ కావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అక్కడ కుక్కలు కనిపిస్తే చాలు కాల్చివెయ్యాలని ఆర్డర్ పాస్ కావడంతో కుక్కల యజమానులకు భయం పట్టుకుంది. ఇక ఇంత రాద్దాంతం ఎందుకు అంటే.. కుక్కలు లేకుండా సిటీ క్లీన్ అండ్ సేఫ్ గా కనిపించడానికి అట. చైనాలో అక్కడి స్థానిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా కుక్కలను కాల్చివెయ్యడం ఏంటి విడ్డూరం కాకపోతే.. అని ఎంత మంది ఎన్ని రకాలుగా అనుకున్నా కానీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. కుక్కలే మా టార్గెట్.. కనిపిస్తే కాల్చివేతే.. అంటూ తెగ రాజభక్తిని చాటుతున్నారు. చైనాలో ఏ ప్రాంతంలో ఇది చోటుచేసుకుందో తెలుసా..?

తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ డయాంగ్ జిల్లాలో ప్రజల శ్రేయస్సు, నగరం పరిశుభ్రత కోసం అంటూ కుక్కలు లేకుండా చెయ్యాలని అక్కడి స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడ ఓ చట్టం తీసుకువచ్చి.. అందులో ఎవరూ కుక్కలను పెంచకూడదని.. తమ దగ్గర ఉన్న కుక్కలను వెంటనే మున్సిపాలిటీ వారికి అప్పగించాలని హుకుం జారీ చేశారు. ఎవరైనా దొంగచాటుగా కుక్కలను కలిగి ఉన్నట్లు తెలిస్తే మాత్రం ఇళ్లలోకి వచ్చి మరీ వాటిని కాల్చివేస్తామని కూడా అధికారులు హూంకరిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం మీద జంతు ప్రేమికులు పోరాటానికి దిగుతున్నారు. అయినా కూడా అధికారులు, ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్ ఏంటో కూడా వినడం లేదు. పాపం కుక్కల పరిస్థితి. కుక్క చావు అంటే బహుశా ఇదేనేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dogs  Shoot  Shoot at soght  china  Dog Festival  China orders  

Other Articles