Actor nassar hospitalised

Actor nassar hospitalised

Nassar, Actor Nassar, Ballaladeva, Cinema Actor Nassar

Actor nassar hospitalised. Tamil and telugu famous actor Nassar hospitalised, He admitted into a hospital with heartstroke.

యాక్టర్ నాజర్ కు గుండెపోటు..!?

Posted: 09/16/2015 10:19 AM IST
Actor nassar hospitalised

బాహుబలి సినిమాలో బిజ్జలదేవగా నవ్వుతూనే విలనిజాన్ని పండించిన నాజర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారట. ఆయనకు నిన్న రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకొన్న టాలీవుడ్, కోలీవుడ్ ఒక్కసారిగా ఉల్కిపడింది. ఆయన ఆరోగ్యంపై ఆరాతీసారు. కాగా ఆయన భార్య కమీలా ప్రస్తుతం నాజర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన వైద్య సహాయం వెంటనే అందిందని... అన్ని పరీక్షలు జరుగుతున్నాయని అవి పూరైన తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. దీంతో సినీ వర్గాల వారు ఊపిరి పీల్చుకొన్నారు.

తమిళ నటుడైన నాజర్ తెలుగులో పలు సినిమాల్లో నటించి తెలుగు వారి అభిమానాన్ని సొంతం చేసుకొన్నాడు.. ముఖ్యంగా చంటి సినిమాలో చెల్లిపై ప్రేమను చూపే అన్నగా ఆయన నటన అత్యద్భుతం... ఇక మాతృదేవోభవలో నాజర్ తాగుబోతుగా.. భార్య వ్యాధి గురించి తెలుసుకొని తనను తాను మార్చుకొనే భర్తగా నటించి అందరినీ మెప్పించారు. పాజిటివ్, నెగిటివ్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నాజర్ ఇటీవల సూపర్ హిట్ బాహుబలి లో బిజ్జల దేవగా... వికలాంగుడుగా నటించి ఆయన తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. త్వరలో బాహుబలి 2 లో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్న నాజర్ ఇప్పుడు ఆస్పత్రిలో చేరడంతో రాజమౌళి షాక్ కు గురయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nassar  Actor Nassar  Ballaladeva  Cinema Actor Nassar  

Other Articles