Telangana cm KCR surely hate this song

Telangana cm kcr surely hate this song

KCR, song on kCR, Telangana, Telangana cm KCR, Telangana Govt, KTR, harish Rao, Kavitha

Telangana cm KCR surely hate this song. A singer from telangana sang a song on telangana cm KCR.

ITEMVIDEOS: కేసీఆర్ బట్టలూడదీసే పాట.. వింటే షాక్

Posted: 09/16/2015 03:27 PM IST
Telangana cm kcr surely hate this song

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత మాటకారో ఒక్క తెలుగు వారికే కాదు దేశంలోని అందరికి తెలుసు.జ ఉద్యమ సమయంలో ఆయన చెప్పిన మాటలు నమ్మిన వాళ్లు ఇప్పుడున్న కేసీఆర్ పాలనను చూసి ఆశ్చర్యపోతున్నారు. మాటలు కోటలు దాటుతున్నా కాలు మాత్రం కడప దాటదు అన్న చందాన కేసీఆర్ గారు అర చేతిలో చుక్కల్లో చూపించి అందరిని నిద్రపుచ్చుతున్నారు. విద్యార్థులను, ఉద్యోగులను, మేధావులను, రాజకీయ నాయకులను ఇలా అందరికి అన్ని రకాలుగా అందరి కంటే ప్రజలను ఎక్కువగా మోసం చేస్తున్నారు. కేసీఆర్ చెప్పిన మాటలకు ఎక్కడెక్కడో ఊహించుకున్న ప్రజలకు నేల చూపులు తప్ప ఏమీ మిగల్లేద. అయితే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రథసారథులు కళాకారులు.. అలాంటి కళాకారులు ఒక్కసారి కేసీఆర్ గురించి వ్యతిరేకంగా అసలు స్వరూపాన్ని వివరిస్తూ పాట పాడితే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి.

కేసీఆర్ మాటల మాయలో యావత్ తెలంగాణ ప్రజానీకం మునిగిపోయింది. అందుకే ఆయన సై కొట్టిన ప్రతి దానికి ఊ కొట్టడం సరిపోయింది. అయితే కేసీఆర్ గారు ఏమన్నారు.. ఏం చేస్తున్నారన్న విషయాలను ప్రస్తావిస్తూ ఓ కళాకారుడు పాడిన పాట నిజంగా కేసీఆర్ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుంది. పేపర్ పులిగా మారిన కేసీఆర్ ఈ వీడియో చూస్తే మాత్రం ఎలా స్పందిస్తారో.. టిఆర్ఎస్ నాయకులు తమ నాయకుడు అని కాకుండా నిజంగా మామూలు ప్రజల తరఫున ఈ వీడియోను చూస్తే వారు కూడా అవుననే అంటారు. రాణి రుద్రమల చరిత్రలు చెప్పి ఒక్క మహిళను మంత్రి చెయ్యని మగ మహారాజు మీరు.. అన్న మాట అక్షరాల నిజం. ‘‘నీ మాటలు కోట దాటె.. మా కడుపులు మాత్రం నిండపాయె... ముఖ్యమంత్రి దళితుడంటివి.. కవితమ్మను బొమ్మ చేస్తివి.. తెలంగాణ తల్లిని చేస్తివి.. కొడుకుకు సిరిసిల్ల రాసిస్తివి.. అల్లుడికి సిద్దిపేట రాసిస్తివి అంటూ సాగిన పాట నిజంగా కసీఆర్ గురించి నిజాలు వెల్లడించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  song on kCR  Telangana  Telangana cm KCR  Telangana Govt  KTR  harish Rao  Kavitha  

Other Articles