దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ కానీ.. తనను జైలులో పెట్టాలని కేంద్ర మానవ వనరులశాఖా మంత్రి స్మృతీ ఇరానీ సవాల్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై భూ కుంభకోణానికి సంబంధించిన అరోపణలు గుప్పించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. దీనిపై ఆమె అమేథీ బహిరంగసభలో స్పందించారు. రైతులు, ప్రజల తరపున మాట్లాడినందుకు తనకు లీగల్ నోటీసులు పంపారని చెప్పారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలని ఆమె రాహుల్‌కు సవాలు విసిరారు.
ఫ్యాక్టరీ పెడతామని తీసుకున్న భూమిలో ఫ్యాక్టరీ అయినా కట్టండి లేదా భూమి అయినా తిరిగి ఇచ్చెయ్యాలని ఆమె మరోసారి కోరారు. లీగల్ నోటీసుల పేరుతో తన నోరు మూయించలేరని చెప్పారు. గతంలో సైకిల్ కర్మాగారం పెడతామంటూ ఓ కంపెనీకి ప్రభుత్వ భూమిని ఇచ్చారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం దివాళా ప్రకటించి భూమిని రాజీవ్ ట్రస్ట్‌కు అమ్మింది. దీన్ని మంత్రి స్మృతీ ఇరానీ సవాలు చేశారు. లోపాయకారీ ఒప్పందంతోటే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది.
అయితే కేంద్ర మంత్రి హోదాలో కొనసాగుతూ.. స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీపై సవాలు విసరడాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్నామన్న ఒకే ఒక్క కారణంతో స్మృతి ఇరానీ ప్రత్యర్థి పార్టీలపైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు సంధించి.. సవాలు చేయడం సరికాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేతిలో ఓటమిని చవిచూసిన తరువాత కూడా ఆయన పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లి సవాళ్లు విసరసడం ఎంతవరకు సమంజసమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more