ఉత్తరప్రదేశ్‌లో నిత్యం జరుగుతున్న నేరాలు, ఘోరాలపై విరుచుకుపడి వాటిని నియంత్రించాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా వ్యవహరించి నెట్ జనుల ఆగ్రహానికి గురయ్యారు. తమలో కాఠిన్యం తప్ప కరుణ్యం ఏ మాత్రం లేదని ఓ ఎస్ ఐ.. మరోసారి తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. లక్నో హజ్రత్‌గంజ్ పోస్టాఫీసు వెలుపల ఓ 65 వృద్దుడు కిషన్ కుమార్ తన జీవనాధారాన్ని సాగిస్తున్నాడు. అయితే రోజుకు పది గంటల పాటు పనిచేసి.. ఆ వచ్చిన పదో పాతికతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అది పూర్తిగా నేరమైనట్లు.. రాజ్యాంగ విరుద్దమైనట్లు, రాజద్రోహంగా పరిగణించిన ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తన ప్రతాపం చూపించాడు. ఖాళీ చేయమన్నా.. ఎందుకు చేయడం లేదని ముసలాయనపై చిందులేశాడు. 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో కూర్చోని తన పని తాను చేసుకుంటున్నానని, ఇప్పుడు అకస్మాత్తుగా ఇక్కడి నుంచి వెళ్లగోడితే ఎక్కడికి వెళ్లాలని ఆయన ఎస్ఐను వేడుకున్నాడు. ఇన్ని ఏళ్లుగా ఇక్కడే వున్నా.. రోజుకు పది గంటలు పనిచేస్తూన్నా.. 50 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి కూడా లేదన్నారు. అలాంటి మరో చోటికి వెళ్తే.. తన పరిస్థితి దయనీయంగా మారుతుందని ప్రాధేయపడ్డాడు.
తన తండ్రి వయస్కుడైన వృద్దుడు రెండు చేతులు జోడించి.. తనను ఇక్కడి నుంచి గెంటి వేయవద్దని బతిమాలినా.. ఆ కఠినాత్ముడు కనుకరించలేదు. చివరకు వృద్దుడికి జీవనాధారమైన టైప్ రైటర్‌ను కాలితో తన్ని పగలకొట్టాడు. రెండు చేతులతో ఎత్తి పడేశాడు. తనపై ఎస్ఐ దౌర్జన్యం చేయడంపై వృద్ధుడు లబోదిబోమన్నాడు. ఎస్ఐ దుర్మార్గాన్ని ఫొటోలు తీసిన స్థానికులు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఎస్ఐ దౌర్జన్యంపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిఎం అఖిలేష్ యాదవ్ దౌర్జన్యానికి పాల్పడ్డ ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, డిఎస్పీ ఇద్దరూ ముసలాయన కిషన్ కుమార్‌ను కలిసి సారీ చెప్పారు. కొత్త టైప్‌రైటర్ కొనిచ్చారు. తన జీవనోపాధిని యధాస్థానంలో కొనసాగించాలని విన్నవించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more