Mob attacked on lovers at Haridwar

Mob attacked on lovers

Haridwar, Lovers, Mob, Moral policing, Attack on lovers

Mob attacked on lovers at Haridwar. In Haridwar, mob attacked on lovers cruelly. Some guys beaten them and some people shoot the whole fight.

ITEMVIDEOS: నడిరోడ్డు మీద ప్రేమికులపై దాడి..

Posted: 09/23/2015 01:44 PM IST
Mob attacked on lovers

అందరూ చూస్తుండగా. మీరు ప్రేమించుకుంటున్నారా..? లేదంటే వ్యభిచారం చేస్తున్నారా..? అంటూ అక్కడ స్థానికంగా కొంత మంది యువకులు కలిసి దాడికి దిగారు. పదలు సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు ప్రేమికులను నడిరోడ్డు మీద చితకబాదారు. కనీసం యువతి అన్న కనికరం కూడా లేకుండా వేధించారు. ఇంకోసారి కనిపిస్తే మిమ్మల్ని వదిలిపెట్టం అంటూ దాడికి దిగిన ఘటన హరిద్వార్ లో చోటుచేసుకుంది. ఇలాంటి వాళ్ల వల్లే అందరూ చెడిపోతున్నారని బాగా కసితీరా కొట్టి.. అక్కడ ఉంటున్న కొంత మంది మంచి మనుషుల వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. హరిద్వార్ లో తాజాగా చోటుచేసుకున్న మోరల్ పోలిసింగ్ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

హరిద్వార్ అంటే హిందు మతంలో పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. అయితే అక్కడ కొంత మంది చేస్తున్న చేష్టల వల్ల అప్రతిష్టపాలవుతున్నారని స్థానికులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారు. ప్రేమికులు అనే భావన కూడా లేకుండా నడివీధిలో దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ డ్యూటీని తామే చేస్తూ అక్కడ భీభత్సాన్ని సృష్టిస్తున్నారు. స్థానిక ప్రేమికులు కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడకుందామని అక్కడి ఓ వీధిలోకి వచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న యువకులు వారి మీద దాడికి పాల్పడ్డారు. పైగా వారిని కొంత మంది కొడుతుంటే మరికొందరు ఆ దాడిని మరికొందరు తమ కెమెరాల్లో షూట్ చేశారు. తీవ్రంగా గాయపడ్డ లవర్స్ ఎంతలా బతిమిలాడినా వదల్లేదు. కొంత మంది పెద్ద మనుషులు వచ్చి వారిని అక్కడి నుండి పంపేచేశారు. దాంతో ప్రాణాలు చేతిలో పట్టుకొని పరుగులు తీశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haridwar  Lovers  Mob  Moral policing  Attack on lovers  

Other Articles