గాంధీ బ్రిటిష్ ఏజెంట్.. నేతాజీ జపాన్ ఏజెంట్.. ఠాగూర్ బ్రిటిష్ తొత్తు అంటూ వ్యాఖ్యలు చెయ్యడం తాను చెప్పిన ప్రతి మాటకు కూడా సరైన ఆధారాలు ఉన్నాయంటూ దేశం కోసం పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధులను టార్గెట్ గా చేస్తుంటారు మార్ఖండేయ కట్జూ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కట్జూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ గా కూడా పని చేశారు. అయితే గాంధీ, నెహ్రూలాంటి వాళ్లనే టార్గెట్ చేస్తూ ఉండే కట్జూ తాజాగా ఓ మతానికి చెందిన విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారు. హిందుమతానికి చెందిన దేవతల మీద విమర్శలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాధేమాను సపోర్ట్ చేశారు. శ్రీకృష్ణుడు, శివుడి గురించి కట్జూ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని రేపుతున్నాయి. మరి ఈ అంశం ఎంతటి సంచనాలకు తెర తీస్తుందో చూడాలి. మరి కట్జూ ఏమ్మన్నారో తెలుసా..?
నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటంలో ప్రసిద్ధుడైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మరో సారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి ఆయన తనను తాను దేవ మాత రాధేమాకు మద్దతుగా మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. రాధేమాను అత్యంత పవిత్రురాలైన దేవమాతగా అభివర్ణించారు. కొందరు ఆమె అశ్లీలత గురించి మాట్లాడుతున్నారు....అసలు మన సంస్కృతిలోనే అశ్లీలత ఉందని కట్జూ తన బ్లాక్ లో పేర్కొన్నాడు. రాధేరాధే బోలో రాధేమా అన్న శీర్షికతో కట్జు తన బ్లాక్ లో ఆమె జైలుకు వెళ్లక తప్పదని కొందరు అంటున్నారు...శ్రీకృష్టుడు జన్మించింది జైల్లో కాదా అని పోస్ట్ చేశారు. రాధేమా నాట్యం చేస్తుందని విమర్శిస్తున్నారు, మహాశివుడు నాట్యం చేయలేదా అని రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more