యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఎన్నికలలో ప్రస్తుతానికి రెండు కూటముల మధ్య బలాబాలాలు సమాన స్థాయిలోనే వున్నాయని తాజా సర్వేలలో వెల్లడైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి మధ్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్ నౌ- సీఓటర్ సర్వే ఎన్డీయేకు 117 సీట్లు, మహాకూటమికి 112 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రెండుపక్షాల మధ్య ఓట్లలో ఒక శాత మే తేడా ఉందని తెలిపింది. ఎన్డీయేకు 43 శాతం, మహా కూటమికి 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు, స్వతంత్రులు 14 సీట్లు గెలుస్తారని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది.
బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో మొత్తం 7,786 మంది శాంపిల్స్‌ను ఈసర్వే తీసుకుంది. వీరిలో 46.8 శాతం మంది నితీష్ కుమారే మళ్లీ సీఎం కావాలను కుంటున్నట్లు చెప్పారు. ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించనప్పటికీ, బీజేపీ నేత సుశీల్ మోదీకి 16 శాతం మంది సీఎంగా పట్టం కట్టారు. 6.7 శాతం మాంఝీని కోరుకోగా, షానవాజ్ హుస్సేన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 5.4 శాతం మంది చెప్పారు. అలాగే ఇండియా టీవీ-సీఓటర్ సర్వే... ఎన్డీయేకు 109-125 సీట్లు, మహా కూటమి 104-120 వస్తాయని అంచనా వేసింది. దీంతో బిహార్ ఎన్నికలలో పోరు రసవత్తరంగా, ఉత్కంఠ భరితంగా మారింది. ఐదు విడతలుగా జరగనున్న ఎన్నికలలో ఎ వరిపై ఎవరు పైచేయి సాధిస్తారోన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే జరిగితే.. మరోమారు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుందా..? స్వతంత్రుల మద్దతుతో ఎవరు గద్దెనెక్కుతారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more