Lady Gaga's song raises sexual assault awareness

Til it happens to you restarts conversation about sexual assault

Lady Gaga, Til It Happens To You, Interscope, Records, Pop, hollywood, sexual assault on college campuses, Til It Happens To You tackles issue of sexual assault, Thousands of girls sexually assaulted, Til It Happens To You video was alarming, Lady Gaga wake-up call on sexual assault

A portion of proceeds from the sale of the song will be donated to organizations helping survivors of sexual assault.

ITEMVIDEOS: అత్యాచార ఘటనలపై గళమెత్తిన లేడీ గాగా..

Posted: 09/26/2015 05:26 PM IST
Til it happens to you restarts conversation about sexual assault

సమాజం మిమల్ని సెలబ్రిటీగా గుర్తిస్తే.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను ప్రశ్నించి..  ఎప్పటికప్పుడు వాటి నిర్మూలణకు పాటుపడటం సెలబ్రిటీలుగా వారి బాధ్యత. అయితే ఈ కోవలో ఎంతో మంది సెలబ్రిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మేలును సమాజానికి చేస్తున్నారు. అయితే సామాజిక సృహతో తాము సామాజానికి ఎంతవరకు చేయగలో అంతా చేస్తూ ప్రచారానికి దూరంగా కూడా వుంటారు. కొందరు తాము నమ్మిన ఫ్రోఫెషన్ లోనే సమాజాన్ని ప్రశ్నిస్తూ.. ప్రజల్లో చైతన్యం కలిగించేలా చేస్తారు. సరిగ్గా అలాంటి పనే చేసి ప్రపంచ వ్యాప్త అభిమానులను ఔరా..? అనిపించింది అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా.

ఇటీవల తాను తాజాగా విడుదల చేసిన ‘టిల్ ఇట్స్ హాప్పెన్స్' కొత్త వీడియోతో సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపుల ఘటనలను, అత్యాచార ఘటనలను ఫోకస్ చేస్తూ ఈ వీడియో తెరకెక్కించారు. చూడటానికి ఈ వీడియో కాస్త ఇబ్బందిగానే ఉన్నా మహిళలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది చూపించారు. మహిళలు శారీరిక, మానసిక వేదనతో పాటు లైంగిక వేధింపులకు లోనైనప్పుడు, అత్యాచార యత్నాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలనే అవగాహన తేవడంలో ఈ వీడియో తోప్పడుతుందని అంటున్నారు.

అగ్రరాజ్యం అమెరికన్ కాలేజీల్లో ప్రతి ఐదు మంది అమ్మాయిల్లో ఒకరు ఈ తరహా లైంగిక వేధింపులకు గురవుతున్నారని సమాచారం తెలుసుకున్న లేడీ గాగా, ఈ సమస్యను టార్గెట్ చేసుకుని అందమైన పదాల కూర్పుతో.. అంతకన్నా మధురమైన గానంతో ‘టిల్ ఇట్స్ హాప్పెన్స్' పేరుతో వీడియో ఆల్బం విడుదల చేసారు. కాలేజీ అమ్మాయిలు, తల్లిదండ్రులు సమాజంలో ఉన్న ఇలాంటి పోకడల పట్ల అప్రమత్తం ఉండాలనే ఒక సందేశంతో ఈ వీడియో తెరకెక్కించారు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రతి దేశంలో మహిళలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారనేది వాస్తవం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : celebrity  college  crime  Lady Gaga  Til It Happens To You  hollywood  video  

Other Articles