పిచ్చి పీక్ స్టేట్ కి ఎక్కిన ఓ నవ వరుడు ప్రచార వ్యామోమంతో చేశాడా..? లేక అతగాడి మిత్రులు ఆటపట్టించడానికి చేశారా..? తెలియదు కానీ ఎప్పుడో తొమ్మిది మాసాల క్రితం ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ.. ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటి ఇప్పుడి వరకు ఆ ఫ్లెక్సీ అలానే ఎలా వుంది అంటారా..? నిజమే ఫ్లెక్సీ లేదు కానీ.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తరువాత.. అది ఎందకనో విశేషంగా ఆకట్టుకోవడంతో ఓ స్మార్ట్ ఫోన్ దారుడు దానినిన తన సెల్ ఫోన్ లో బందించి... తాజాగా నెట్ లో అప్ లోడ్ చేశాడు. ఇంతకీ విషయానికి రండీ అంలున్నారా..? ఆ ఫ్లెక్సీలో అంత విచిత్రమేమిటీ అంటున్నారా..?
ఎవరైనా సర్వసాధరణంగా నిశ్చితార్థానికో.. లేక వివాహానికో బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. తమను ఆశీర్వదించి.. తమ బోజనతాంబులాదులు స్వీకరించి వెళ్లాల్లని వధువరులో లేక వారి తరపున వారి కుటుంబ పెద్దలో ఆహ్వానిస్తుంటారు. కానీ ఇక్కడ విభిన్నమైన కార్యక్రమానికి ఆహ్వానించాడు వరుడు. కదణరంగంలోకి అడుగుపెడుతున్న యువరాజులా ఫోజు పెట్టి.. సరిగ్గా అలాంటి ఆహార్యంతోనే స్టిల్ పెట్టి మరీ బంధుమిత్రులను ఆహ్వానించాడు. దేనికంటారా..? తన శోభనానికి. వినడానికే విచిత్రంగా వున్నా ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.
రాత్రంతా జరిగే తన శోభన కార్యక్రమం అదే నండి తొలి రాత్రి వేడుకను మధుర రాత్రిగా మలిచేందుకు.. మార్చుందుకు బందుమిత్రులందరూ రావాలని ఫ్లెక్సీలు వేసి మరీ అక్కడక్కడ జనసంద్రాత అధికంగా వుంటూ పలుప్రాంతాల్లో పెట్టాడు. అవసరం వున్నా.. లేకున్నా.. తమ ఫోటో నలుగురికి కనబడాలనే పిచ్చి వున్న వాళ్లు అనేకం కాబట్టే దీనిని కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే రానురాను ఈ ఫ్లెక్సీ ఆకట్టుకుంటుండం.. శోభనమహోత్సవ ఆహ్వానం అని వుండటంతో ఆకట్టుకుంది. దుర్భరేవులోని తమ స్వగృహమునందు రాత్రంతా జరిగే కార్యక్రమానికి అహ్వానం అలస్యంగా అందడం పక్కన బెడితే.. ఈ ఫ్లెక్సీ ఫోటో మాత్రం నెట్ లో హల్ చల్ చేస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more