గుజరాత్ ప్రభుత్వం పటేళ్ల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీని ప్రకటించడాన్ని పటేళ్ల నేత హార్దిక్ పటేల్ తప్పుబట్టారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమకు ప్యాకేజీ లాలీపాప్ లాంటిదని, దానిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్యాకేజీకి వ్యతిరేకంగా లాలీపాప్ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై పటిదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్య ఏడ్చే పిల్లలకు లాలీపాప్ ఇచ్చినట్లుగా ఉందని...అందుకే గుజరాత్‌లో లాలీపాప్ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వ ప్యాకేజీ పటేల్ వర్గానికి లాలీపాప్ వంటిదని హార్దిక్ పటేల్ ఆరోపించారు.
ఆందోళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పటేల్ వర్గీయులకు లాలీపాప్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 29 తర్వాత లాలీపాప్ ఉద్యమం చేపడతామని చెప్పారు. పటేల్ రిజర్వేషన్లపై 29న గుజరాత్ హైకోర్టులో విచారణ జరుగనుంది. అయితే కొంతమంది ఔత్యాహిక పటేల్ మద్దతుదారులు రాజ్‌కోట్‌లో ఇప్పటికే లాలీపాప్‌లు పంచుతున్నారు. పటేళ్లకు గుజరాత్ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయడం లేదని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గీయులకు ఇప్పటికే ఇస్తున్న పథకాలను ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. తమను ఓబీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేస్తున్న పటేళ్లను శాంతింపజేసేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చింది. రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్ స్పష్టం చేశారు. పటేళ్లు ఆందోళన విరమించాలని ఆమె కోరారు. అటు తమకు ప్యాకేజీలు అవసరం లేదని తమ ఏకైక లక్ష్యం రిజర్వేషన్లు సాధించడమే అని పటేల్ నేతలు తేల్చిచెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more