Najeeb Jung gets some unexpected support from Arvind Kejriwal

Najeeb jung good man with bad political bosses kejriwal

arvind kejriwal, najeeb jung, delhi, delhi lg, jung replaced, bjp, congress, politics, pmo, delhi governor replaced, kejriwal jung, Aam Aadmi Party, AAP, BJP, Congress, Delhi, Lt Governor, Najeeb Jung, Udit Raj, good man with bad political bosses

Delhi Chief Minister Arvind Kejriwal on Saturday said Lt Governor Najeeb Jung is a "good man with bad political bosses"

‘‘ఆయన చెడు రాజకీయ నేతల చేతిలో వున్న మంచి వ్యక్తి’’

Posted: 09/26/2015 08:06 PM IST
Najeeb jung good man with bad political bosses kejriwal

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌‌‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనకేసుకొచ్చారు. ఆయన చాలా మంచి వ్యక్తేనని కితాబు ఇస్తూ ట్వీట్ చేశారు. అయితే జంగ్ చెడ్డ రాజకీయ నేతల చేతుల్లో ఉన్నారని, ప్రధానమంత్రి కార్యాలయం ఆయనను ప్రభావితం చేస్తోందని విమర్శించారు. కమిషనర్ నియామకం, ఏసీబీ, సీఎన్‌జీ స్కామ్‌పై దర్యాప్తు వంటి పలు అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగాయి. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, పాలనలో జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల వరకు మండిపడటంతో పాటు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు.

మరోవైపు జంగ్‌పై కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించగా తాజాగా బీజేపీ కూడా అదే బాట పట్టింది. ఆయన సుపర్ కింగ్‌గా వ్యవహరిస్తున్నారని.. వెంటనే తొలంగించాలంటూ బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్‌గా సీఎం కేజ్రీవాల్ శనివారం జంగ్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆయనను తొలగించాలని డిమాండ్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇందులో జంగ్ తప్పేమీ లేదని, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే ఆయన పాటిస్తున్నారంటూ సానుభూతి వ్యక్తం చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవి నుంచి నజీబ్ జంగ్‌‌ను తొలగించినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఆయన స్థానంలో వచ్చే వ్యక్తి కూడా అలాగే వ్యవహిస్తారన్నారు. ఢిల్లీపై ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోకపోవడమే సమస్యకు సరైన పరిష్కారమని సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  najeeb jung  Lt Governor  delhi  

Other Articles