Kerala Government Website Hacked by Suspected Pakistani Hackers

Kerala government website hacked

Pak hackers,Pakistan hackers,Kerala government website hacked,Kerala Government,Kerala Chief Minister Oommen Chandy,website hacked,Thiruvananthapuram, Person Communication and Meetings,Centre for Development of Imaging Technology

Suspected Pakistani hackers have hacked the official website of the Kerala government, www.keralagov.in, late Saturday night.

పాకిస్థాన్ వికృత చేష్టలు.. యువతలో విషం నింపుతున్న దాయాధి

Posted: 09/27/2015 12:04 PM IST
Kerala government website hacked

దాయాధి దేశం 'పాకిస్థాన్ వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. భారత్ పై తమ వారిలో ఎలా విషం నింపుతున్నారన్న ఘటనలకు ఇదో చిన్న ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటి వ్యతిరేక భావం నిండిన ఓ పాకిస్తాన్ హ్యాకింగ్ బృందం.. క్రితం రోజు రాత్రి భారత దేశానికి చెందిన ఓ రాష్ట్రం ప్రభుత్వ వెబ్ సైట్ ను హాక్ చేసి.. అందులో తగలబడుతున్న త్రివర్ణ పతాకం, ఆ వెంటనే పాకిస్థాన్ అనుకూల నినాదాలను పోస్ట్ చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ లోకి వెళ్లిన వారికి కనిపించింది ఇవే దృశ్యాలు.

పలువురి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న ప్రభుత్వాధికారులు రాత్రికిరాత్రే నిపుణులను రప్పించి వైబ్ సైట్ ను పునరుద్ధరించారు. అసలేం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆదివారం ఉదయం ప్రకటించారు. కేరళ ప్రభుత్వ వెబ్ సైట్ (www.keralagov.in) శనివారం అర్ధరాత్రి తర్వాత హ్యాకింగ్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన హ్యాకర్లే ఈ దురాగతానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవెలప్ మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీ వారు సైట్ ను పునరుద్ధరించారని కేరళ సీఎం చాందీ తెలిపారు. దీనిని తీవ్రమైన చర్యగా భావిస్తున్నట్లు, వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala government  website hacked  pakistani hackers  Government site hacked  

Other Articles