Here's the question Mark Zuckerberg asked that almost made the Indian prime minister cry

This was the question zukerberg asked that made indian pm modi cry

Question that made modi cry, modi emotional, zuckerburg made modi cry, modi on his mother, Facebook, mother, Mark Zuckerberg, narendra modi, social network’s Menlo Park, Calif

it was a question from Zuckerberg himself, about family, that got an unexpectedly emotional response from the prime minister.

ITEMVIDEOS: ప్రధాని నరేంద్ర మోడీ కంట.. కన్నీరు పెట్టించిన ఆ ప్రశ్న ఇదే..!

Posted: 09/29/2015 01:41 PM IST
This was the question zukerberg asked that made indian pm modi cry

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు ఆ దేశం వీసా కూడా ఇచ్చేందుకు నిరాకరించగా, ఇప్పుడు తాజాగా ఆయనను ఏడిపించింది. నరేంద్రమోడీ సోషల్ మీడియాను శ్లాఘించి.. 24 గంటలు కూడా గడవకముందే.. ఆయనను అదే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కన్నీళ్లను పెట్టుకునేలా చేసింది. ఇందుకు ముఖ్యకారణంగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్. జుకెన్ బర్గ్.తో సుమారు 50 నిమిషాల పాటు సాగిన భేటీ సంధర్భంగా జరిగిన సంభాషణలో జుకెన్ బర్గ్ అడిగిన ప్రశ్నకు బావోద్వేగానికి గురయిన మోడీ కంటతడి పెట్టుకున్నారు. “మీకు ..మాకు ఎంతో సారూప్యత ఉంది. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. అనగానే వారు ఈ భేటికీ హాజరైన సభికుల మధ్యలో వున్న బర్గ్ తల్లిదండ్రులు లేచి నిల్చున్నారు. వారికి సభికులు కరతాళాధ్వనులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత బర్డ్ మాట్లాడుతూ.. మనకు కుటుంబాలు చాలా ముఖ్యం. మీ జీవితంలో కూడా మీ అమ్మగారు చాలా ముఖ్యం కదా ?” అమె గురించి కూడా కొంచెం మాతో పంచుకోండి అని జుకెన్ బర్గ్ మోడీతో అన్నారు.

అంతే ఉన్నట్టుండి నరేంద్రమోడీ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చిన్ననాటి రోజులు కళ్లముందు కనిపించాయి. అవతారపురుషుడైనా ఓ తల్లికి కోడుకే అన్న చందంగా.. ఆయన ఓ ఉపఖండానికి ప్రధాని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. తన తల్లి తమను పెంచి పెద్ద చేసేందుకు చిన్పప్పుడు పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ.. కంటతడి పెట్టుకున్నారు. ఆనంతరం ఆయన అమ్మ గురించి మాట్లాడుతూ..” నా జీవితంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. మాది చాలా నిరుపేద కుటుంబం. నేను కూడా రైల్వే స్టేషన్లో టీలు అమ్మేవాడిని. మేం చాలా చిన్న పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో పనిమనిషిగా చేరింది. పిల్లలను పెంచడానికి తల్లి ఎంత కష్టపడాలో చూడండి. మోడీ తల్లే కాదు భారతదేశంలోని ఎన్నో లక్ష్లల మంది తల్లులు తమ పిల్లల పెంపకం కోసం జీవితాలను త్యాగం చేస్తున్నారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు ఇప్పుడు 95 ఏళ్లు. అయినా ఆమె తన పనులను తానే చేసుకుంటారు” అని మోడీ తడిఆరిన గొంతుతో చెప్పారు. తన తల్లి కష్టాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరువాత బర్గ్ అడిగిన నాలుగు ప్రశ్నలకు కూడా మోడీ సమాధానాలు చెప్పారు.

సోషల్ మీడియాలో బాగమైన తొలిసభ్యులలో మీరు ఒకరు. సోషల్ మీడియా, అంతర్జాలం ప్రభుత్వాలను నడిపించడంలో, పరిపాలన సాగించడంలో దోహదపడుతాయని కీలక అస్త్రాలుగా మారుతాయని బావించారా..? అన్న ప్రశ్నకు మోడీ సమాధానమిస్తూ.. తాను తొలిసారిగా తనకున్న ఆసక్తిమేరకు సోషల్ మీడియాలో సభ్యుడిగా చేరానన్నారు. అయితే అప్పుడు దాని ప్రభావం ఇంతలా వుంటుందని తనకు తెలియదన్నారు. అయితే క్రమంగా సామాజిక మాద్యమం ప్రభుత్వాన్ని ప్రజలతో మమేకమయ్యేలా చేసిందని అన్నారు. ఐదేళ్లకు ఒ పర్యాయం తమకు ఎన్నికలు నిర్వహణ జరుగుతుందని, అయితే సోషల్ మీడియా రావడంతో ప్రతీ ఐదు నిమిషాలకు ఎన్నికలను నిర్వహించుకోగలుగుతున్నామని నరేంద్రమోడీ అన్నారు. రానున్న ఐదేళ్లకాలంలో ఆరు లక్షల గ్రమాలకు ఓఎఫ్సీ కేబుల్ ద్వారా అనుసంధానం చేసి వాటికి డిజిటల్ ఇన్ ఫ్ఱాస్ట్రక్చర్ తో పాటు ఫిజికల్ మౌలికవసుతును కూడా కల్సిస్తామన్నారు. భారత దేశం గురించి తెలిసిన వారి.. నదులతో పాటు పరివాహిక ప్రాంతంలో జనసాంధ్రత, అవాసాలు ఏర్పర్చుకుని వున్నారని తెలుసు. కానీ రానున్న రోజుల్లో నెట్ వర్క్, ఆప్టిక్ ఫైబర్ వున్న ప్రాంతాలను అవాసాలుగా మారుతాయని దీనిని గుర్తెరిచి భవిష్యత్తుకు బాటలు వేయాలని మోడీ చెప్పారు.

Also Read: జుకెర్ బర్గ్ చిట్ చాట్ లో కంటతడి పెట్టిన మోదీ

జుకెర్ బర్గ్ చిట్ చాట్ లో కంటతడి పెట్టిన మోదీ


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  mother  Mark Zuckerberg  narendra modi  

Other Articles