Producer And Director Tammareddy Bharadwaja Raised New Question On Pawan Kalyan Deeksha Against Tamil Language Act | Pawan Kalyan Controversy

Pawan kalyan deeksha against tamil language act tammareddy bharadwaja

pawan kalyan news, pawan kalyan updates, pawan kalyan controversy, pawan kalyan tamil language act, pawan kalyan deeksha news, pawan kalyan tamilnadu deeksha, tammareddy bharadwaja, telugu language

Pawan Kalyan Deeksha Against Tamil Language Act Tammareddy Bharadwaja : Producer And Director Tammareddy Bharadwaja Raised New Question On Pawan Kalyan Deeksha Against Tamil Language Act Why He Steps Back.

‘ఆ విషయంలో పవన్ ఎందుకు వెనక్కు తగ్గారో?’

Posted: 10/02/2015 03:24 PM IST
Pawan kalyan deeksha against tamil language act tammareddy bharadwaja

అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని ప్రకటించిన జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ విషయంలో వెనకడుగు వేశారు. తమిళనాడులో ప్రవేశపెట్టిన ‘నిర్బంధ తమిళ భాషా చట్టం’ ఆ రాష్ట్రంలో వున్న ఇతర మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమవ్వాల్సి వస్తుంది. దీనిపై గతంలో ఆయా భాషావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు భాష పరిరక్షణ కోసం పవన్ ఉద్యమం చేపట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ నెలాఖరులోనే పవన్ దీక్ష చేపట్టనున్నారని, అందుకు సంబంధించిన వ్యవహారాలను ఆయన అభిమానులు, తెలుగు భాషాభిమానులు సన్నాహాలు కూడా మొదలుపెట్టారని ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ.. ఆ తర్వాత దాని ఊసే లేదు. దీంతో ఆ ఉద్యమంపై పవన్ ఎందుకు వెనక్కి తగ్గారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయంపై తాజాగా దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తెలుగు భాషా పరిరక్షణ కోసం తమిళనాడులో ఉద్యమం చేపడుతానని పేర్కొన్న పవన్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలియడం లేదన్నారు. ఆయన గనుక ఆ ఉద్యమంలో పాల్గొంటే చైతన్యం వస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన తమిళనాడు యువశక్తి సమావేశంలో తమ్మారెడ్డి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు. ఇక ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నారాయణ మాట్లాడుతూ.. తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించకపోతే రక్తాక్షరాలతో ఉద్యమం చేపడతామని చెప్పారు. అలాగే తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించాలని ఉత్తరాల ఉద్యమం చేయబోతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి తెలుగు బోధన కొనసాగేలా చూడాలని కోరారు.

ఇదిలావుండగా.. పవన్ ఆ ఉద్యమం చేపడతానని స్వయంగా పేర్కొన్న దాఖలాలైతే లేవు కానీ.. అలా చేపట్టకపోవడంపై తెలుగు భాషాభిమానులు కాస్త నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన ఆ ఉద్యమంలో పాల్గొంటే ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా రాజకీయ పార్టీలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తారని, దీంతో తెలుగు భాషను పరిరక్షణకు ఆస్కారం వుంటుందని అంటున్నారు. మరి.. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  tamil language act  tollywood  

Other Articles