telugu mahila woman activist questions party leaders on insurance claim

Telugu mahila activist protest against own party

telugu mahila activist protest against own party, gayatri questions own party leaders, TDP woman worker, t gayatri, vijayawada, insurance, sunkamma vemula, nara lokesh, party leaders at vijayawada, vijayawada party office

telugu mahila activist protest against own party in front of vijayawada office alleging that party leaders negligence on her mother death insurance

సభ్యత్వం చేసేప్పుడేమో అలా.. ఇప్పుడిలా.. టీడీపీ పార్టీ, నేతలను ఏకేసిన తెలుగు మహాళా..

Posted: 10/02/2015 05:53 PM IST
Telugu mahila activist protest against own party

తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఆ పార్టీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమాను అమలుచేయడంలో తనను దగా చేశారంటూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఓ మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల మృతిచెందిన తన తల్లి వేముల సుంకమ్మ(49)కు మంజూరు చేయాల్సిన రూ. 2 లక్షల ఇన్సూరెన్స్‌ను విడుదల చేయడంలో పార్టీ నాయకులు అలసత్వం వహిస్తున్నారని గుంటూరు సంగడిగుంటకు చెందిన టి.గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పార్టీ నాయకుడు నారా లోకేశ్‌ను విజయవాడలో కలిసి మెరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు.

లోకేశ్ కూడా ఇన్సూరెన్స్ రాదని నిర్లక్ష్యంగా మాట్లాడారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆమె వాపోయింది. తనతో పాటు కుటుంబ సభ్యులందరం తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి ఇన్సూరెన్స్ కార్డులు పొందామని ఆమె వివరించింది. పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో కలిసి గాయత్రి గురువారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మీడియా ప్రతినిధులు ఆమెతో మాట్లాడగా తన గోడు వెళ్లబోసుకున్నారు.

తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిందని, ఆమెకు పార్టీ సభ్యత్వం ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్‌ను సాకులు చెప్పి ఎగ్గొట్టారని విలపించింది. భర్తలేని తనకు కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిని కలిసేందుకు విజిటర్స్ పాయింట్‌లో వేచి ఉన్న ఆమె ఎలాగైనా  సీఎంను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP woman worker  t gayatri  vijayawada  insurance  

Other Articles