Father thrashes four-year-old to death for failing to cover her head

Up father kills 4 year old daughter for not covering her head

Muslim,father,strangled,daughter,4,death,Child abuse, Father kills 4-yr-old daughter, Violence against children,Bareilly ,india,Uttarpradesh, mask, father kills daughter, Mulsim father, farheen, , molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A four-year-old girl in a village near Bareilly was killed allegedly by her father for failing to cover her head while having food, Uttar Pradesh police have said.

కసాయి.. ముసుగు వేసుకోలేదని నాలుగేళ్ల చిన్నారిని...

Posted: 10/03/2015 05:52 PM IST
Up father kills 4 year old daughter for not covering her head

మతాంధకారం కన్నపేగును కడతేర్చింది. తమ మతంలో మహిళలు ముఖానికి ముసుగు వేసుకోవాలని.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తన కన్న కూతుర్నే నెలకేసి బాది మరీ చంపాశాడు కసాయి. తలకు ముసుగు వేయలేదన్న ఒక్క కారణం తప్ప..  తనను తన తండ్రి ఎందుకు చితక్కోడుతున్నాడో కూడా తెలియదు ఆ చిన్నారి తల్లికి. ఉత్తరప్రదేశ్ లోని బారెల్లీకి సమీప గ్రామంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పర్హీన్ అనే నాలుగేళ్ల బాలిక శుక్రవారం మధ్యాహ్నం తల్లితో కలిసి భోజనం చేస్తోంది. ఆ సమయంలో తలపై ముసుగు తొలగిపోవడాన్ని ఆమె గమనించలేదు.

ఇది చూసిన బాలిక తండ్రి జఫర్ హుస్సేన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను పట్టుకుని పలుసార్లు నేలకేసి కొట్టి చంపేశాడు. శవాన్ని ఇంట్లో పాతేయమని భార్యను ఆదేశించాడు. అయితే అందుకు నిరాకరించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో భయపడిన స్థానికులు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు సాహసించలేదు. మూడు గంటల తర్వాత వచ్చిన పోలీసులు జఫర్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. ఐదుగురు సంతానం కలిగిన ఆ కుటుంబం పేదరికం కారణంగా పలుసార్లు పస్తులుండేదని స్థానికులు చెబుతున్నారు. జఫర్ హుస్సేన్‌ మతాన్ని గుడ్డిగా ఆచరించేవాడని, మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో బంధువులు కూడా అతడికి దూరమయ్యారని గ్రామస్థులు చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : father  daughter  uttar pradesh  india  kills  Violence against children  

Other Articles