సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి మార్ఖండేయ కట్జూ మరోసారి వివాదాలకు కేరాఫ్ గా నిలిచారు. గతంలో నేతాజీ మీద, గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన కట్జూ తాజాగా మరోసారి గోమాంసం మీద వ్యాఖ్యలు చేశారు. కట్జూ చేసే వ్యాఖ్యలు నేరుగా చేస్తే పర్లేదు కానీ మరొకరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం లేదంటే ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ గా చెయ్యడం వివాదాస్పదమవుతోంది. ఆవు మాంసం తిన్నారని ఓ వ్యక్తిని కొట్టి చంపడం ఎంత వరకు కరెక్ట్ అని కట్జూ ప్రశ్నించారు. ఆవు ఒక జంతువు మాత్రమే. ఒక జంతువు ఎవరికీ తల్లి కాదు. ఆవు మాంసం తింటే తప్పేంటి? నేను కూడా తింటాను.. ఇకపై కూడా తింటాను అని స్పష్టం చేశారు.
ఆవు మాసం తినేవారంతా చెడ్డవారని చెప్పలేమని... ఆ మాంసంను తినని వాకారరు మంచి వారని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆవు మాంసం తింటేనే దాడులు చేస్తున్నారు. మరి ఎలుక, కోతి, పాములు, చేపలను చంపడం లేదా? వాటిని తినడం లేదా? వినాయకుడి వాహనం ఎలుక కదా? మరి ఎలుకను ప్రతి ఇంట్లో మందు పెట్టి చంపుతున్నారు? హనుమంతుని ప్రతిరూపమైన కోతిని ఎందుకు సర్కస్‌లలో ఉపయోగిస్తున్నారు? అంతే కాకుండా ఎలుకలను, కోతులను ప్రయోగ పరీక్షలకు ఎందుకు వినియోగిస్తున్నారు? ఈ విషయాలపై ఎవరూ ఎందుకు స్పందించరు? నాగపంచమి నాడు నాగుపామును పూజిస్తారు. మరి శివుని మెడ చుట్టూ ఉన్న ఈ నాగును కొందరు ఎందుకు చంపేస్తున్నారు? విష్ణు అవతారమైన చేపను తింటలేమా? వరహావతారమైన పందులను చంపుకు తినడం లేదా? యమధర్మరాజ వాహనమైన బర్రెను, లక్ష్మి వాహనమైన గుడ్లగూబను, శని దేవుని వాహనమైన కాకిని భక్షించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో హిందూ మనోభావాలు దెబ్బతినకూడదంటే జంతు వధపై చట్టం తేవాలని సూచించారు. మొత్తానికి కట్జూ చేసిన తాజా కామెంట్ లు ఎలాంటి దుమారానికి తెర తీస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more