16 Years Completed To Mexico Teziutlan Village Smashed In Mud Incident | Nature Anger Incidents

Mexico teziutlan village smashed with mud in 1999 nature anger incidents

Mexico Teziutlan, Mexico Teziutlan incident, Mexico Teziutlan village, Mexico Teziutlan mud, Mexico Teziutlan updates, Mexico Teziutlan 16 years, Mexico Teziutlan news, Mexico Teziutlan photos, Mexico Teziutlan incident gallery, nature anger incidents

Mexico Teziutlan Village Smashed With Mud In 1999 Nature Anger Incidents : 16 Years Completed To Mexico Teziutlan Village Smashed In Mud Incident.

ప్రకృతి ప్రకోపానికి బురదలో బలైన గ్రామం..

Posted: 10/05/2015 06:59 PM IST
Mexico teziutlan village smashed with mud in 1999 nature anger incidents

అదో చిన్న కుగ్రామం. కేవలం 60 నుంచి 80 ఇళ్లులుండే ఆ గ్రామం వాతావరణం ఎంతో ప్రశాంతంగా వుండేది. ప్రకృతి ఒడిలో సేద తీరుస్తున్న అందమైన ప్రదేశంలా కనువిందు చేస్తుండేది. ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా అక్కడి ప్రజలు హాయిగా తమ జీవితాన్ని జీవించేవారు. కానీ ఆ గ్రామంపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఇప్పుడది బురదలో కొట్టుకుపోయిన సమాధిగా మారింది. ఆనందంగా జీవితాన్ని గడిపిన ప్రజల్లో దాదాపు చాలామంది బురదలో కొట్టుకుపోయారు. ఒకప్పుడు పచ్చని చెట్లతో ఆకర్షించిన ఆ గ్రామంలో ఇప్పుడు బురద, కొండరాళ్లతో నిండిపోయింది. వాటిని తొలగించేందుకు దాదాపు నెలరోజులకు పైగానే పట్టింది.. ఆ గ్రామాన్ని మళ్లీ అందంగా తీర్చిదిద్దేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. మెక్సికోలోని టెజియుట్లాన్ గ్రామం పరిస్థితి ఇది.

ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టెజియుట్లాన్ గ్రామం బురదలో కూరుకుపోయింది. దాదాపు 60 నుంచి 80 ఇళ్లుండే టెజియుట్లాన్ అనే చిన్న గ్రామం మొత్తం వర్షాల కారణంగా వెల్లువెత్తిన బురద, రాళ్ల కింద కప్పబడిపోయింది. కుండపోత వర్షాల మూలంగా ఏకంగా ఒక పర్వతమే కూలిపోవడంతో అందులోనుంచి వచ్చిన రాళ్లు, బురద ఈ గ్రామాన్ని సమూలంగా సమాధి చేసేశాయి. ఈ బురదను, కొండరాళ్లను తొలగించడానికి సైనిక దళాలకు దాదాపు నెలరోజులకు పైగా పట్టింది. ఈ వరదల్లో సుమారు నాలుగు వందలమందికి  పైగా మృతిచెందగా అందులో దాదాపు 200 మంది టెజియుట్లాన్ గ్రామవాసులే ఉన్నట్లు అధికారిక లెక్కలు నమోదయ్యాయి. 1999 అక్టోబర్ 5వ తేదీన ఈ సంఘటన జరిగి ఇప్పటికి 16 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఆ ఘటనను గుర్తు చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంతో పాటు అకలహామా అనే మరో గ్రామం కూడా బురదలో కూరుకుపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexico Teziutlan  nature anger incidents  

Other Articles