A Mother Named Gangulamma Has Killed Her Own Son With Boyfriend Ravi Nayak For Disturbing Their Illegal Affair | Anantapur District Crime News

Mother gangulamma killed son with boyfriend ravi nayak anantapur district crime news

illegal affairs, illegal affairs crime news, mother killed son, mother gangulamma illega affair, gangulamma illegal affair news, illegal affairs murders, son killed by mother, gangulamma killed son vamshi

Mother Gangulamma Killed Son With Boyfriend Ravi Nayak Anantapur District Crime News : A Mother Named Gangulamma Has Killed Her Own Son With Boyfriend Ravi Nayak For Disturbing Their Illegal Affair.

అక్రమబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకునే చంపేసింది!

Posted: 10/05/2015 05:56 PM IST
Mother gangulamma killed son with boyfriend ravi nayak anantapur district crime news

తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడి సమాయంతో కన్న కొడుకునే అత్యంత దారుణంగా హతమార్చింది ఓ కర్కశ తల్లి. అందరినీ కలచివేసే ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంబులపూల కుంట మండలం వడ్డిపల్లెకు చెందిన ప్రభాకర్‌ కు, అదే గ్రామానికి చెందిన గంగులమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు వంశి(14) నల్లచెరువులోని మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అప్పటివరకు అన్యోన్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో అనుకోకుండా విభేదాలు చోటు చేసుకున్నాయి. తరచూ గొడవలు జరిగేవి. దాంతో వారిరువురు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దంపతులు విడిపోయి నాలుగు సంవత్సరాలు గడించింది. ఇద్దరు పిల్లలు తండ్రివద్దే వడ్డిపల్లెలో ఉంటున్నారు.

భర్తతో విడిపోయిన అనంతరం గంగులమ్మ అనంతపురానికి చెందిన రవి నాయక్‌తో సంబంధం కొనసాగిస్తోంది. అంతేకాదు.. మరికొందరితో కూడా ఆమె తిరుగుతుండడాన్ని గమనంచిన కొడుకు వంశి.. తన తల్లిని ప్రశ్నించాడు. తండ్రివద్దే ఉండాలని కోరాడు. దాంతో కక్ష పెంచుకున్న గంగులమ్మ కొడుకును కడతేర్చాలని నిర్ణయించుకుంది. గత నెల 27వ తేదీ ప్రియుడితో కలిసి నల్లచెరువులోని స్కూలుకు వెళ్లి.. మాయమాటలు చెప్పి వంశిని పిలుచుకువచ్చింది. కదిరి సమీపంలోని ఎర్రదొడ్డి గంగమ్మ గుడి పక్కకు తీసుకెళ్లి రవి నాయక్ సహకారంతో గొంతునులిమి చంపేసి.. పక్కనున్న కాలువలో పడేసింది.

స్కూలుకు వెళ్లిన కుమారుడు కనిపించకుండా పోవడంతో ప్రభాకర్ ఈనెల 2వ తేదీ నల్లచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారించగా.. వారికి గంగులమ్మ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దాంతో వారు ఆమె సెల్‌ఫోన్ కాల్స్‌పై నిఘా ఉంచారు. వాటి ఆధారంగా సోమవారం గంగులమ్మను, రవి నాయక్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. తామే వంశిని చంపేసి, కాలువలో పడేశామని నేరాన్ని అంగీకరించారు. పోలీసులు ఎర్రదొడ్డి కాలువలో గాలించగా వంశి మృతదేహం దొరికింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : illegal affairs crime  mother killed son  gangulamma  

Other Articles