దేశంలో ఈ కామర్స్ సైట్ లలో ఎంతో పేరున్న ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్. అయితే గత కొంత కాలంగా ఫ్లిప్ కార్ట్ వార్తల్లో నిలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో అసలు వస్తువులకు బదులుగా రాళ్లు వస్తున్నాయని కూడా వార్తలు వచ్చాయి. అలాగే తాజాగా మరోసారి ఫ్లిప్ కార్ట్ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. అందుకు గాను ఫ్లిప్ కార్ట్ సిఈఓకు దిల్లీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. కొట్టేసిన సెల్ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ తన ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా అమ్మిందని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ మోసాలకు తాము కూడా మోసపోయామా అన్న అనుమానాలు చాలా మంది కస్టమర్లలో తలెత్తుతున్నాయి. అసలు ఫ్లిప్ కార్ట్ వద్దకు కొట్టేసిన ఫోన్లు ఎలా వచ్చాయి..? ఎలా మార్కెట్ చెయ్యగలిగారు..? దిల్లీ పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటి లాంటి వివరాలు తెలియాలంటే మొత్తం స్టోరీ చదవండి.
దిల్లీ ఎయిర్ పోర్ట్ లో హాంకాంగ్ నుండి వచ్చిన సరుకులో సెల్ ఫోన్లు మాయమయ్యాయి. అయితే అలా మాయమైన ఫోన్ల గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ తర్వాత అలా మాయమైన ఫోన్లు ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ ద్వారా కస్టమర్లకు చేరడం కస్టమ్స్ అధికారులకు షాక్ తినిపించింది. దాంతో రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు అసలు కూపీ లాగడం మొదలుపెట్టారు. దాదాపు 40 లక్షల విలువైన 209 ఫోన్ల వివరాలను దిల్లీ పోలీసులు ట్రేస్ చేశారు. అయితే ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం వీటిని ఎలా పొందింది అన్న దాని మీద ఎంక్వైరీ నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్ యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేశారు. మరి అసలు మతలబేంటో త్వరలోనే పోలీసులు గుట్టువిప్పుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more