విమానం టేకాఫ్ అయి కేవలం కొద్దిసేపు మాత్రమే అయింది.. అంతవరకు పరిస్థితులు బాగానే నడిచాయి.. కానీ ఇంతలోనే పైలట్ అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. అతనిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.. కొద్దిసేపటికే ఆ పైలట్ ప్రాణాలు వదిలేశాడు.. అంతే! ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది.. కో-పైలట్ కంగారులో పడిపోయాడు.. కానీ కొన్ని వందల ప్రాణాలు తన చేతిలోనే వున్నాయని భావించిన ఆ కో-పైలట్ ధైర్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానాన్ని దించాడు. దీంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇక్కడ ఆ కో-పైలట్ గురించి చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏమిటంటే.. పైలట్ చనిపోయిన విషయాన్ని ముందుగా ప్రయాణీకులకు తెలియకుండా అతడు జాగ్రత్తపడటంతో ఓ భారీ ఆందోళన, భయానికి తావివ్వకుండా చేసినట్లయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఎయిర్ లైన్స్ విమానం 550 విమానం ఆదివారం రాత్రి 11.55 గంటలకు ఫోనిక్స్ నుంచి బోస్టన్కు బయలు దేరింది. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యి, ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విమానం బాధ్యతలు పూర్తి స్థాయిలో కో పైలెట్ తీసుకున్నాడు. తొలుత కో-పైలట్ కంగారు పడినా.. ధైర్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా దించేలా కృషి చేశాడు. మధ్యలోనే సిరాకస్కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించిన ఆ కో-పైలట్.. మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు. దీంతోపాటు రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్ను పంపించాలని కోరాడు. ఇందుకు సిరాకస్ అధికారులు అంగీకరించడంతో దానిని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా దించివేశాడు. అలా దించిన తర్వాతనే పైలెట్ చనిపోయాడని, అందుకే విమానం అత్యవసరంగా దిగిందని, తోటి ప్రయాణీకులకు, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు తెలిసింది.
కో పైలెట్ నిర్వహించిన ఈ బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకున్నారు. ఆ అమెరికన్ విమానంలోని మొత్తం 147 ప్రయాణికులను ఎయిర్ బస్ ఏ 320 ద్వారా బోస్టన్ నగరానికి తరలించారు. ఇదిలావుండగా.. కో పైలెట్ కూడా పైలెట్కు ఉండే సామర్థ్యతను కలిగి ఉంటాడని, అతడు ప్రమాదాలను నివారించగలడని అమెరికా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా ఎయిర్ లైన్స్లో ప్రయాణంలో ఉండగా ఏడుగురు పైలెట్లు, ఒక చార్టర్ పైలెట్ మరణించాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more