Mother exchange for their children

Mother exchange for their children

The two ladies recently met through an online programme called Fortune Mother Exchange, a web-service where such mothers deliver their children home-cooked food away from home. Each shares her recipes with the other, cooking techniques are exchanged, and here’s how they find their children a mother in another city.

The two ladies recently met through an online programme called Fortune Mother Exchange, a web-service where such mothers deliver their children home-cooked food away from home. Each shares her recipes with the other, cooking techniques are exchanged, and here’s how they find their children a mother in another city.

ITEMVIDEOS: తల్లులను మార్చేయండి.. బిడ్డలను సంతోషపెట్టండి

Posted: 10/08/2015 03:49 PM IST
Mother exchange for their children

ప్రపంచంలో బెస్ట్ వంట వండే వాళ్లు ఎవరు అంటే ఖచ్చితంగా అమ్మ. తల్లిని మించిన బెస్ట్ కుక్ ప్రపంచంలో ఎవరూ లేరని అందరికి తెలుసు. అయితే చాలా మంది పిల్లలు చదువుల వల్ల వేరే చోట్లకు వెళ్లాల్సి రావడం.. దాంతో అమ్మచేతి వంట మిస్ కావడం జరుగుతోంది. అయితే అలా ఎంతో మంది తల్లులు తమ బిడ్డలకు ఇష్టమైన వంటకాలను వడ్డించలేకపోవడం జరుగుతోంది. అయితే ఓ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అయితే ఇలా ఓ ఐడియా వస్తే అలా బాధపడుతున్న తల్లులకు చాలా మేలు చేసింది. ఆ ఐడియానే మదర్ ఎక్చేంజ్ అంటే అమ్మలను మార్చడం. అసలు మదర్ ఎక్చేంజ్ కాన్సెప్ట్ వెనక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా..?  

రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వివేక్ బీటెక్ డిగ్రీ కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో సంతోష్ అనే చెన్నై విద్యార్థి జోధ్ పూర్ లోని ఐఐటీలో విద్యాభ్యాసం కోసం వెళ్లాడు. వీరిద్దరి తల్లుల పేర్లు మంజు, ఐశ్వర్య. ఇద్దరు తల్లులకూ తమ కుమారులు ఎలా తింటారు? ఎక్కడ ఉంటారు? అన్నది ప్రధాన దిగులు. తమిళ హాస్టళ్లలో ఉన్న ఆహారం రాజస్థాన్ వాసులకు నచ్చదు. రాజస్థాన్ హాస్టళ్ల ఫుడ్ ను తమిళులు తినలేరు. ఆ సమయంలో ఇద్దరు తల్లులనూ కలిపింది 'ఫార్చ్యూన్ మదర్ ఎక్స్ఛేంజ్'. ఇదో ఆన్ లైన్ ప్రోగ్రామ్. వీరిద్దరి మనసులూ కలిశాయి. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకూ ఒకరి బిడ్డకు మరొకరు తల్లిగా ఉండటానికి ఒప్పందం కుదిరింది. అంతవరకూ బాగానే వుంది. ఆహారం విషయం సంగతేంటి. అదే ప్రధాన సమస్యగా మారింది.

ఇక ఇద్దరు తల్లులూ తమ మెదడుకు పనిపెట్టారు. ఒకరి వంటకాలను మరొకరు నేర్చుకున్నారు. అందుకు ఎన్నో పాట్లు పడ్డారు. బిడ్డలకు నచ్చిన ఆహారాన్ని వండి పట్టడానికి వారు పడిన శ్రమ అంతా ఇప్పుడు వీడియో రూపంలో బయటకు వచ్చింది. ఈ వీడియోను దాదాపు 4 లక్షల మంది వీక్షించి, ఇద్దరు తల్లుల సరికొత్త ప్రయత్నానికి అభినందనలు చెబుతున్నారు.ఇలా ఇద్దరు తల్లులు కలిసి తమ పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం ద్వారా తమ ప్రేమ, ఆప్యాయతలను పొందగలిగారు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా అదిరిపోయింది. మదర్ ఎక్చేంజ్ కాన్సెప్ట్ నిజంగా సూపర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles