Venkiah Naidu on special status

Venkiah naidu on special status

Ordinance, Venaih Naidu, Congress, Special status, AP, Telangana, bifurcation

Venkaiah Naidu slams congress party for special status. Venkaiah naidu slams congress party leaders after they loos the status, they demanding for special status. Congress party leaders didnt add the special status to the ap in ordinance.

మీ హోదా పోయాక హోదా గుర్తుకు వచ్చిందా..?

Posted: 10/10/2015 08:37 AM IST
Venkiah naidu on special status

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కల్పించకుండా నాటకాలాడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తనస్టైల్లో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నాయకులకు తమ హోదా పోయి తర్వాత కానీ ప్రత్యేక హోదా అంశం గుర్తుకురాలేదని విమర్శించారు. ఏపికి ప్రత్యేక హోదా మీద ఒక్కటే కాకుండా అభివృద్ది ఎలా చెయ్యాలి అన్న దాని మీద ఆలోచిస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబటి ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ప్రాజెక్టులకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను ఎందుకు పట్టించుకోలేదు... చట్టంలో ఎందుకు పెట్టలేదు... ఎన్నికల ముందు హామీ ఇస్తే సరిపోతుందా అంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు.

ప్రత్యేక హోదాకు సంబంధించి నీతి ఆయోగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విషయాలను నివేదించారని, దీనిపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేస్తోందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ పరిష్కారం కావని... అయితే హోదా వల్ల మేలు జరుగుతుంది. అందుకే ఈ హోదాను తానే కోరానని వెంకయ్య అన్నారు. ఇంతకుముందు 11 రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. వాటి పరిస్థితి ఎలా ఉందో తనకు తెలుసని వెంకయ్య నాయుడు వివరించారు. దీనిపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేశాక ఏ నిర్ణయం వస్తుందో చూడాలని అన్నారు. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ordinance  Venaih Naidu  Congress  Special status  AP  Telangana  bifurcation  

Other Articles