Consider total ban on beef in 3 months

Consider total ban on beef in 3 months

Beef Ban, Ban on Beef, HImachalpradesh, Himachalpradesh High court, Jammu Kashmir, jammu Kashmir assembly on beef Ban

Himachal Pradesh high court on Wednesday asked the Centre to consider enacting a law prohibiting slaughter of cows, their import/export and sale of beef and its products across the country within three months. The court also directed the Centre to allocate funds to the state government for providing shelter and fodder to cows and formulate special schemes for their protection.

మూడు నెలల్లో బీఫ్ బ్యాన్ చెయ్యండి

Posted: 10/15/2015 01:04 PM IST
Consider total ban on beef in 3 months

దేశంలో నడుస్తున్న వివాదాల్లో బీఫ్ వివాదం ఒకటి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీప్ ను బ్యాన్ చేస్తూ అక్కడి కోర్టులు తీర్పులివ్వడం... దాని మీద రకరకాల వివాదాలు చెలరేగడం మామూలైపోయింది. ఇప్పటికే జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీఫ్ మీద బ్యాన్ ఉంది. అక్కడ గోమాంసం విక్రయాలు, గోమాంసం ఎగుమతి, దిగుమతులు కూడా నిషేదం. అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ దేశవ్యాప్తంగా గోమాంసాన్ని నిషేదించాలని కేంద్రానికి సూచించింది. మరో మూడు నెలల్లో బీఫ్ ను పూర్తిగా బ్యాన్ చెయ్యాలని కేంద్రానికి సూచించింది. అలాగే గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి, దిగుమతి కూడా చెయ్యకూడదని కేంద్రానికి సూచించింది. ఇప్పటికే దాద్రిలో గోమాంసం తిన్నాలన్న ఆరోపణల మీద ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాగా కేంద్రానికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ తీర్పు మరిన్ని కష్టాలను తెచ్చిపడుతొంది.

గోమాంసాన్ని నిషేదించడమే కాకుండాగోవులను రక్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సూచించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రాలకు గోవులను రక్షించేందుకు, గోశాలలను నడిపించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తెలిపింది. అలా కేంద్రం నిధులను రాష్ట్రాలకు కేటాయింగా.. వాటిని స్థానిక సంస్థలకు పంచాలని.. అలా స్థానిక సంస్థలు గోవులను రక్షించేందుకు నడుంబిగించాలని హైకోర్ట్ వెల్లడించింది. అలాగే ఆవుల్లో మైక్రోచిప్ లను వాడి.. వాటి బాగోగులను చూడాలని కోర్ట్ సూచించింది. హిమాచల్ ప్రదేశ్ లోని అన్ని కమీషనరేట్ లకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుండి మూడు నెలల పాటు గో సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కోర్టుకు వెల్లడించాలని అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న బీఫ్ బ్యాన్ మీద హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles