Muslims fasting on Navaratri celebrations

Muslims fasting on navaratri celebrations

Muslims, navaratri, Dasara, Dasara Celebrations, tolerance, Dadri Incident, Religion

At a time when reports about religious intolerance are dominating the headlines, two Muslim youth of Lucknow University set a unique example of communal harmony. Sahaduddin Ahmed alias Sameer, a close relative of Pram Vir Chakra winner Abdul Hamid and his friend Abdul Kalim observed fast on the first day of Navratri. The two will also observe fast on the last day.

నవరాత్రి ఉత్సవాల్లో ముస్లింల ఉపవాసం

Posted: 10/15/2015 01:27 PM IST
Muslims fasting on navaratri celebrations

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎంతో రంగరంగ వైభవంగా సాగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో మత సామరస్యం కనిపిస్తోంది. దేశంలో చాలా చోట్ల అల్లర్లు జరుగుతున్నా.. బారత దేశం మతసామరస్యానికి ప్రతీక అని చాలా సందర్భాల్లో నిరూపించబడింది. తాజాగా దాద్రి ఘటనతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముస్లిం వ్యక్తి నిషేదిత మాంసాన్ని తిన్నారన్న ఆరోసణలతో కొట్టి చంపేసిన ఘటన కలకలం రేపింది. తర్వాత ఆ గ్రామంలో గొడవలు జరగడం.. మ్యాటర్ సీరియస్ కావడం ప్రదాని మోదీ మీద కూడా విమర్శలు రావడం జరిగింది. అయితే బిన్నత్వంలో ఏకత్వానికి నిలయంగా ఉన్న బారత్ లో మత ఆచారాలను గౌరవించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ముస్లిం మతస్తులు ఎంతో పవిత్రంగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేస్తారు అలాగే హిందు పండుగలకు హిందువులు ఉపవాస దీక్ష చేసి దేవుడిని ప్రార్థించడం మామూలే. మరి మస్లింలు నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేస్తే ఎలా ఉంటుంది...? లక్నోకు చెందిన ఇద్దరు ముస్లిం విద్యార్థులు నవరాత్రి సందర్బంగా ఉపవాస దీక్ష చేశారు.

లక్నోలోని లక్నో యూనివర్సిటిలో అరబ్ కల్చర్ మీద పిజి చేస్తున్న షహదుద్దీన్ అహ్మద్ అలియాస్ షామీర్, అతని మిత్రుడు అబ్దుల్ కలీం నవరాత్రులు వేడుకల్లో  భాగంగా ఉపవాస దీక్ష చేశారు. హాస్టల్ లో ఉపవాస దీక్ష చేసి అమ్మవారి వద్దకు వెళ్లి ఫలహారాన్ని అందరికి పంచిపెట్టారు. ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారికి హారతి ఇచ్చారు. సామరస్యానికి అసలు నిర్వచనంగా నిలుస్తున్నారు షామీర్. తన గ్రామంలో కూడా తన ఇంటి నుండే ఏ పండగైనా ప్రారంభమవుతుందని అంటున్నారు షామీర్. అసలు అన్ని మతస్థులు కలిసి పండగలను సెలబ్రేట్ చేస్తే.. దాద్రి ఘటనలు జరగవు అని హితవు పలుకుతున్నారు. మొత్తానికి ఇలా మతసామర్యానికి షామీర్ ఆదర్శంగా నిలవడం... దేశంలో ఇలాంటి వాటిని వెలుగులోకి తీసుకురావడం భారతదేశంలో మతసామరస్యానికి మరింత బలం చేకూరుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muslims  navaratri  Dasara  Dasara Celebrations  tolerance  Dadri Incident  Religion  

Other Articles