మొన్నామధ్యన డాక్టర్ పేషంట్ మీద లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన గుచి విన్నాం. కానీ తాజాగా ఓ డాక్టర్ మీద పేషంట్ లైగింక వేధింపులకు పాల్పడ్డారు. మత్తుమందిచ్చిమరీ.. లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఫిజియోథెరపీ వైద్యురాలిపై లైంగిక దాడి చేయడంతో పాటు బ్లాక్మెయిల్ చేసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మనోజ్ సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ బండ్లగూడలోని జేఆర్ రెసిడెన్సీలో నివాసముంటున్నాడు. అదే అపార్ట్మెంట్లో నివసించే ఓ ఫిజియోథెరపీ వైద్యురాలి కుటుంబంతో మనోజ్ కుటుంబం చనువుగా ఉండేది. అయితే, మనోజ్ అనారోగ్యంతో ఇబ్బంది పడగా గత మే నెలలో ఆ వైద్యురాలిని తన ఫ్లాట్‌లోకి పిలిపించుకుని వైద్యం చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆమెపై కన్నేసిన మనోజ్ తన భార్య ఇంట్లోలేని సమయంలో ఆమెను వైద్యం కోసం మళ్లీ పిలిపించుకున్నాడు. ముందే వేసుకున్న పథకం ప్రకారం వైద్యం అనంతరం ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ తప్పిన తర్వాత బెడ్రూంలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు.
ఆ తర్వాత మనోజ్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే మళ్ళీ రావాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నిత్యం ఫోన్‌ద్వారా వేధిస్తుండంతో చివరికి జరిగిన విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో వారు మనోజ్‌పై ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు మనోజ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడి మీద అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఆ వైద్యురాలు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. మొత్తంగా డాక్టర్ ను లైంగికంగా వేధించిన కామాంధుడిని పోలీసులు కటకటాలపాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more