Chandrababu Naidu giving importance to that Minister more than Modi

Chandrababu naidu giving importance to that minister more than modi

Chandraabu Naidu, Amaravati, Modi, Venkaiah Naidu, Amaravati inauguration, central govt, Venkaiah Naidu, Venkaih naidu with chandrababu, Chandrababu Naidu on amaravati, Amaravati inauguration ceremony, Amaravati news, Amaravati updates, Amaravati as smart city, smart cities, capital city Amaravati

Nara chandrababu Naidu more hopeful on that central minister about ap and amaravati. Chandrababu taking care and special treat for that minister in amaravati inauguration ceremony.

మోదీ కన్నా బాబుకు అతడు చాలా ముఖ్యం..

Posted: 10/17/2015 10:44 AM IST
Chandrababu naidu giving importance to that minister more than modi

అవును మీరు చదువుతున్నది  నిజమే.. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోదీ అనుగ్రహం చాలా అవసరం. అందుకే కేంద్రంతో చంద్రబాబు నాయుడు చాలా సఖ్యతతో మెలుగుతున్నారు. ఏపికి కేంద్రం నుండి సపోర్ట్ కావాలి.. ఆర్థిక సహాయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఏపికి ప్రత్యేక నిధులు.. ప్రత్యేక హోదా ఇలా చాలా అంశాల్లో ఏపికి కేంద్ర సహాయం కావాల్సి ఉంది. ఏపి నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపనకు మైలురాయి పడుతున్న తరుణంలో నరేంద్ర మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు. అమరావతికి కేంద్రం తరఫున ప్రత్యేకంగా ఏదో ఒక బహుమతిని ఆశిస్తున్నారు ఏపి నాయకులు. అయితే మొత్తం వ్యవహారంలో మోదీ కన్నా చంద్రబాబు నాయుడు ఓ వ్యక్తిని బాగా నమ్ముతున్నారు. అతడే ఏపికి ఉన్న ఏకైక ఆశ అన్న నమ్మకంతో ఉన్నారు. ఎవరా వ్యక్తి.? ఇంతకీ ఆ వ్యక్తికి అంత సీన్ ఉందా..?

ప్రధాని నరేంద్ర మోదీ ఏపి రాజధాని నిర్మాణానికి వస్తున్నారు.. అలాగే ఎంతో మంది కేంద్ర మంత్రులు, దేవ విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా వస్తున్నారు. అయితే అందరి కన్నా ఓ వ్యక్తి గురించి మాత్రం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చూడనున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.? ఇంకెవరు ప్రస్తుతం కేంద్రంలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి వెంకయ్ నాయుడు. వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖను, అలాగే పార్లమెంటరీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. కేంద్రంలో ప్రస్తుతం మోదీ తర్వాత కాస్తో కూస్తో మాట చెల్లుతుంది అంటే అది వెంకయ్య నాయుడుదే అని చాలా మంది నమ్మకం. మరి వెంకయ్య నాయుడును ప్రసన్నం చేసుకుంటే చంద్రబాబు నాయడుకు న్యాయం జరుగుతుందా..? ఏపికి తగిన న్యాయం చెయ్యగలిగే సత్తా ఉందా..?

కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఎన్డీయే ప్రభుత్వంలో వెలుగు వెలుగుతున్నారు. దాదాపు అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత చనువు... తెలివి ఉన్న నేత వెంకయయ నాయుడు. అందుకే మోదీ కూడా వెంకయ్య నాయుడును బాగా నమ్ముతారు. పార్లమెంట్ లో ఎదుటి వారికి ధీటైన సమాధానాలే కాదు. విపక్షాలకు ధీటుగా సమాధానాలు చెప్పి.. ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తున్నారు. స్మార్ట్ సిటీల కార్యక్రమానికి వెంకయ్య నాయుడు నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనక వెంకయ్య నాయుడు ఉంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడును నమ్ముతున్నారు. అమరావతి, ఏపికి వెంకయ్య నాయుడు మధ్యవర్తిత్వం వహించి... కేంద్రం నుండి మరిన్ని నిధులు ఊహిస్తున్నారు.

అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చులొ మేజర్ వాటా కేంద్రం నుండి ఆశిస్తున్నారు ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు. అందుకే వీలైనంత వరకు కేంద్రంలో అధికారంలో ఉన్కన యుపిఎ పక్ష నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మోదీ తర్వాత అందరి చేత ఆమోదించపబడే నేత వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు తలుచుకుంటే ఓ తీర్మానానికి అందరికి ఆమోదం తీసుకురాగల సమర్తుడు. అందుకే చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. గతంలో కూడా వెంకయ్య నాయుడు చాలా సార్లు స్పష్టంగా చెప్పారు... కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత వరకు వీలైతే అంత వరకు సహాయం చేస్తుందని.. దానికి తాను హామీగా ఉంటానని అన్నారు.

మోదీని ప్రసన్నం చేసుకుంటే నిధులు, ఇతరత్రాలు సాధివచవచ్చు కానీ మోదీ అన్ని అంశాలను రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. పైగా అన్ని ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఏపి మీద ప్రేమ చూపిస్తే మిగిలిన రాష్ట్రాల సిఎంలు కూడా కేంద్రం మీద వత్తిడి తీసుకువస్తారు. అదే వెంకయ్య  నాయుడును గనక ప్రసన్నం చేసుకుంటే మోదీతో సహా కేబినెట్ మంత్రులను కూడా ఒప్పించగలుతారు. అందునా ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో కేంద్రం చేయూత కావాలి. స్మార్ట్ సిటీలు, పట్టణాబివృద్ది శాఖ వెంకయ్య నాయుడు చేతిలో ఉన్నందున మోదీ కన్నా చంద్రబాబు నాయుడు వెంకయ్యకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles